నైట్ పబ్ లో ఫుల్ గా ఎంజాయ్ చేసిన బిగ్ బాస్ బ్యాచ్... డాన్సులతో మామూలు వీరంగం కాదు!

Published : Jun 29, 2023, 04:47 PM IST

బిగ్ బాస్ సీజన్ 6 బ్యాచ్ మొత్తం ఓ చోటకు చేరారు. నైట్ పబ్ లో పార్టీ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.   

PREV
17
నైట్ పబ్ లో ఫుల్ గా ఎంజాయ్ చేసిన బిగ్ బాస్ బ్యాచ్... డాన్సులతో మామూలు వీరంగం కాదు!
Bigg Boss Telugu 6


బిగ్ బాస్ సీజన్ 6 గత ఏడాది గ్రాండ్ గా ముగిసింది. గత సీజన్స్ తో పోల్చుకుంటే లేటెస్ట్ సీజన్ కి అంతగా ఆదరణ దక్కలేదు. కనీసం ఓ సీరియల్ కి వచ్చే రేటింగ్ కూడా రాలేదు. దీనికి పలు కారణాలు వినిపించాయి. నాగార్జున హోస్టింగ్ తో పాటు, కంటెస్టెంట్స్, గేమ్స్, ఎలిమినేషన్స్ విమర్శల పాలయ్యాయి. 

27
Bigg Boss Telugu 6


విన్నర్ గా సింగర్ రేవంత్ టైటిల్ అందుకున్నాడు. ఫైనల్ లో శ్రీహాన్-రేవంత్ టైటిల్ కోసం పోటీపడ్డారు. అయితే శ్రీహాన్ ఫలితం రాక ముందే ఓటమి ఒప్పుకున్నాడు. నాగార్జున ఆఫర్ చేసిన డబ్బులు తీసుకుని టైటిల్ రేవంత్ కి అప్పగించాడు. ఓట్ల ఆధారంగా గెలిచింది శ్రీహానే అనే చివర్లో నాగార్జున ప్రకటించించడం జరిగింది. 


 

37
Bigg Boss Telugu 6

ఆదిరెడ్డి, కీర్తి భట్, గీతూ, శ్రీసత్య, బాలాదిత్య, ఇనయ, ఫైమా వంటి కంటెస్టెంట్స్ పాప్యులర్ అయ్యారు. ఈ సీజన్ కి శ్రీసత్య బాగా నెగిటివిటీ మూటగట్టుకుంది. ఆమె ప్రవర్తన మెజారిటీ ఆడియన్స్ కి నచ్చలేదు. స్నేక్ అంటూ ట్రెండ్ చేశారు. అయితే ఆమెకు తల్లి ఎంట్రీ సింపతీ తెచ్చి పెట్టింది. ఫ్యామిలీ వీక్లో వీల్ చైర్ లో ఉన్న శ్రీసత్య తల్లి హౌస్లోకి ఎంటర్ కావడంతో శ్రీసత్య మరి కొన్ని వారాలు హౌస్లో ఉండేందుకు వీలైంది. 

47
Bigg Boss Telugu 6

శ్రీసత్య అనూహ్యంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా బయటకు వచ్చింది. ఫైనల్ కంటెస్టెంట్ గా టాప్ ఫైవ్ లో ఉండే ఛాన్స్ కోల్పోయింది. ఓవర్ కాన్ఫిడెన్స్ తో గేమ్ ఆడి గీతూ బలైంది. తొమ్మిది వారాలకే ఎలిమినేటై ఇంటికి వచ్చేసింది. కామనర్ గా అడుగుపెట్టిన ఆదిరెడ్డి సత్తా చాటాడు. ఫైనల్ కి వెళ్ళాడు. 

 

57
Bigg Boss Telugu 6

కాగా ఈ బిగ్ బాస్ సీజన్ 6 బ్యాచ్ మొత్తం ఓ పబ్ లో ఎంజాయ్ చేశారు. శ్రీసత్య ప్రీ బర్త్ డే పార్టీని ఎంజాయ్ చేశారు. ఈ పార్టీలో ఆదిరెడ్డి, గీతూ, అర్జున్ కళ్యాణ్, రేవంత్, ఆర్జే సూర్య, ఫైమా సందడి చేశారు. అలాగే గత సీజన్ లో పాల్గొన్న ముక్కు అవినాష్, అరియనా, మెహబూబ్ సైతం జాయిన్ అయ్యారు. 

67
Bigg Boss Telugu 6

మరో విశేషం ఏమిటంటే శ్రీసత్య ప్రీ బర్త్ డే పార్టీలో శ్రీసత్య తల్లి కూడా పాల్గొన్నారు. వీల్ చైర్ లో ఆమె పబ్ కి వెళ్లారు. ఈ పార్టీకి సంబంధించిన వీడియోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. 

 

77
Bigg Boss Telugu 6

ఇటీవల ఈ బిగ్ బాస్ బ్యాచ్ మొత్తం బీబీ జోడీలో సందడి చేశారు. ఈ డాన్స్ రియాలిటీ షోలో మెహబూబ్-శ్రీసత్య ఓ జంటగా పార్టిసిపేట్ చేశారు. అవినాష్-అరియనా ఒక జంట. ఆర్జే సూర్య-ఫైమా ఒక జంట. అనూహ్యంగా అవినాష్, ఫైమా జోడీలు ఫైనల్ కి వెళ్లాయి. టైటిల్ మాత్రం ఫైమా జోడీని వరించింది. అయితే మెహబూబ్, శ్రీసత్య బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. 

click me!

Recommended Stories