బిగ్ బాస్ సీజన్ 5 (Bigg boss Telugu 5) చివరి దశకు చేరుకుంది. మరో వారంలో విన్నర్ ఎవరో తేలిపోనుంది. ఇక హోస్ట్ నాగార్జున సండే ఎపిసోడ్ ని ఎంటర్టైనింగ్ గా నడిపారు. కంటెస్టెంట్స్ తో గేమ్స్ ఆడించారు. మొదటగా ఇంటి సభ్యులను రెండు టీమ్స్ గా విభజించారు. శ్రీరామ్, కాజల్, షణ్ముఖ్ ఒక టీంగా, మానస్, సన్నీ, సిరి మరొక టీం గా ఎంపిక చేశారు. ఇక ప్రతి టీమ్ నుండి ఒక సభ్యుడు వచ్చి, స్లిప్ లో ఉన్న పాటను నటించిన చూపాలి, తమ టీమ్ సభ్యులు సదరు పాట ఏమిటో గెస్ చేయాలి. ఈ గేమ్ ఆసక్తికరంగా సాగింది. ఎక్కువ సార్లు గెస్ చేసిన శ్రీరామ్ టీం... ఈ గేమ్ లో మానస్ టీం పై గెలవడం జరిగింది.