Pushpa Pre Release event: బ్లాక్ శారీలో రష్మిక గ్లామర్ మెరుపులు.. తగ్గేదే లే అంటూ అదరగొట్టిన బన్నీ కూతురు

First Published | Dec 12, 2021, 9:28 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన హైఓల్టేజ్ యాక్షన్ మూవీ పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి భాగం 'పుష్ప ది రైజ్' పేరుతో డిసెంబర్ 17న ఈ చిత్రం విడుదలవుతోంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన హైఓల్టేజ్ యాక్షన్ మూవీ పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి భాగం 'పుష్ప ది రైజ్' పేరుతో డిసెంబర్ 17న ఈ చిత్రం విడుదలవుతోంది.

విడుదల సమయం దగ్గర పడుతుండడంతో నేడు హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. అల్లు అర్జున్ అభిమానులతో ప్రీ రిలీజ్ ప్రాంగణం జనసంద్రాన్ని తలపిస్తోంది. 


అల్లు అర్జున్ నినాదాలతో ఫ్యాన్స్ హోరెత్తిస్తున్నారు. ప్రీ రిలీజ్ వేడుకకు రాజమౌళి, కొరటాల శివ లాంటి స్టార్ డైరెక్టర్స్ అతిథులుగా హాజరయ్యారు. రష్మిక మందన బ్లాక్ శారీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైంది. 

  సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడవ చిత్రం ఇది. ఆర్య, ఆర్య 2 తర్వాత వీరిద్దరూ మరోసారి చేతులు కలిపారు. సుకుమార్ చిత్రాలు విభిన్నమైన కథలతో ఉంటాయి.   

 ఈ చిత్రాన్ని సుకుమార్ ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్ లుక్, గెటప్, బాడీ లాంగ్వేజ్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. 

ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు మరో స్థాయికి చేర్చింది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇక రష్మిక మునుపెన్నడూ లేని విధంగా పల్లెటూరి యువతి పాత్రలో అందాలు ఆరబోస్తోంది.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యంలో వచ్చిన అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్.. కుమార్తె అల్లు అర్హ, కుమారుడు అల్లు అయాన్ ఇద్దరూ హాజరయ్యారు. తగ్గేదే లే అంటూ వేదికపై ముద్దు ముద్దుగా డైలాగ్ చెప్పి అలరించారు. 

యువదర్శకులు బుచ్చిబాబు, వెంకీ కుడుముల కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యారు. అలాగే అల్లు అర్జున్ తో సన్నిహితంగా ఉండే దర్శకుడు మారుతి కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెరిశారు. 

ఇక రష్మిక మందన చూపు తిప్పుకోలేని విధంగా బ్లాక్ శారీ లో గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. ఇదిలా ఉండగా చిత్ర దర్శకుడు సుకుమార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు కాలేకపోయారు. 

ముంబైలో పుష్ప చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో సుక్కు బిజీగా ఉండడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు కాలేదు. 

Latest Videos

click me!