ప్రియాంక (Priyanka) అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చే మరో కంటెస్టెంట్ మానస్. ఈ సీజన్లో లో ప్రేమ పక్షులుగా వీరిద్దరి పేర్లు మారుమ్రోగాయి. మొదటి వారం నుండే ప్రియాంక మానస్ పట్ల అట్రాక్ట్ అయ్యారు. హౌస్ లో ఉన్న అందరు అబ్బాయిలను అన్నయ్య అంటాను... ఒక్క మానస్ ని తప్ప అంటూ.. ప్రియాంక పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇచ్చింది.
మానస్ (Manas) మొదట్లో ప్రియాంకను పట్టించుకోలేదు. దాని కారణం ఆమె ట్రాన్స్ జెండర్ కావడమే. ఒక ట్రాన్స్ జెండర్ తో పబ్లిక్ గా ప్రేమ వ్యవహారం అంటే మామూలు విషయం కాదు. బయట ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తారు. అదేదో పరువు తక్కువ పనిగా సమాజం చిత్రీకరిస్తుంది. ఇవన్నీ ఆలోచించిన మానస్ ఆమెకు దగ్గర కావడానికి సంకోచించారు. అయితే ప్రియాంక ప్రేమ అతన్ని మార్చివేసింది. మెల్లగా మానస్ కూడా ఆమెకు దగ్గరయ్యాడు.
అయితే ప్రియాంక అంత డీప్ గా కాదు, అతనికి తన ఆట పట్ల కేర్ ఉంది. ప్రియాంక మాత్రం మానస్ ని తన జీవితంగా హౌస్ లో మెదిలింది. సొంత భార్య కంటే ఎక్కువగా అతని యోగక్షేమాలు చూసుకునేది. తిండి దగ్గర నుండి గేమ్స్, టాస్క్స్ వరకు అతని ప్రయోజనం కోసం ఆలోచించేది. ఎలిమినేషన్ సమయంలో ప్రియాంకను చూసిన ఎవరికైనా ఆమె మానస్ ని ఎంతగా పేమించిందో అర్థమవుతుంది.
మానస్ ని వదిలి వెళ్లలేక ఆమె వేదన అనుభవించారు. మానస్ ప్రస్తావ వచ్చిన ప్రతిసారి ఆమె కళ్ళ నుండి ధారగా నీళ్లు కారాయి. అన్నీ తెలిసి కూడా ప్రియాంక అతనిపై ఆ స్థాయిలో ప్రేమ పెంచుకోవడం పొరపాటే. ఎందుకంటే బిగ్ బాస్ ప్రేమలు శాశ్వతం కాదు. గేమ్ కోసం సెన్సేషన్ కోసం కొందరు ఇష్టం ఉన్నా లేకున్నా దగ్గరైనట్లు నటిస్తారు.
ఒకవేళ నిజంగా దగ్గరైనా హౌస్ నుండి బయటికి వచ్చాక వదిలేస్తారు. ప్రియాంక తీరు చూస్తుంటే అలా లేదు. నువ్వు ఎంతగా ప్రేమించినా ఒక ట్రాన్స్ జెండర్ ని అతడు ఎలా దగ్గరకు తీసుకుంటాడు.. ఇది ప్రకృతి విరుద్ధం. కాబట్టి ఎప్పటికైనా ప్రియాంక వాస్తవంలోకి వస్తే బెటర్.
ఇక హౌస్ నుండి బయటికి వచ్చిన వెంటనే ప్రియాంక మానస్ కోసం ప్రచారం మొదలుపెట్టింది. హౌస్ లో ఉన్న ఆరుగురు గెలవాలని కోరుకుంటున్నాను.. అంటూనే అందరూ మానస్ కి ఓటు వేయాలని విజ్ఞప్తి చేసింది. ఒక బెస్ట్ ఫ్రెండ్ గా మానస్ టైటిల్ విన్నర్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.
మరి మానస్ పై ఇంత ప్రేమ పెంచుకున్న ప్రియాంక పట్ల మానస్ బయటికి వచ్చాక ఎలా ప్రవర్తిస్తారో.. ఆమెను ఎలా రిసీవ్ చేసుకుంటాడో తెలియదు కానీ... కృష్ణుడు కోసం మీరాబాయి ఎదురుచూస్తున్నట్లు వేయి కళ్ళతో ప్రియాంక మానస్ కోసం ఎదురు చూస్తుంది. ఇక ఈ బిగ్ బాస్ ప్రేమలు నమ్మడానికి వీలు లేదు.
గత సీజన్ టైటిల్ విన్నర్ హౌస్ లో హరికతో సన్నిహితంగా ఉండి... బయటికి వచ్చాక సిస్టర్ అంటూ బాంబ్ పేల్చాడు. మరి మానస్ ప్రియాంకను ఎలా పిలుస్తాడో చూడాలి.