ఎన్టీఆర్‌ని ఆటాడుకున్న మహేష్‌.. రాజమౌళి మీకు అన్ని ఆటలు చూపిస్తాడంటూ మహేష్‌కి తారక్‌ హెచ్చరిక..గెలిచిందేంతంటే?

First Published | Dec 5, 2021, 11:28 PM IST

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ కలిసి ఓ టీవీ షోలో సందడి చేశారు. అంతేకాదు ఒకరినొకరు ఆడుకున్నారు. ఎన్టీఆర్‌కి మహేష్‌ చుక్కలు చూపిస్తే.. రాజమౌళి మిమ్మల్ని అన్ని రకాలుగా ఆడుకుంటాడని ఎన్టీఆర్‌ హెచ్చరించడం హాట్‌ టాపిక్‌ అవుతుంది. 
 

ఎన్టీఆర్‌(Ntr) హోస్ట్ గా జెమినీ టీవీలో `ఎవరు మీలో కోటీశ్వరులు`(Evaru Meelokoteeswarulu) ఐదో సీజన్‌ షో రన్‌ అవుతుంది. అది ఎండింగ్‌కి చేరుకుంది. ఆదివారం ఎపిసోడ్‌తో ఈ సీజన్‌ని పూర్తి చేసుకుంది. ఫినిషింగ్‌ టచ్‌గా మహేష్‌బాబు(Mheshbabu) సందడి చేశారు. `ఎవరు మీలో కోటీశ్వరులు` నిర్వహకులు, ఎన్టీఆర్‌ కోరిక మేరకు మహేష్‌ ఈ షోలో సందడి చేశారు. ఆదివారం ఈ ఎపిసోడ్‌ ప్రసారమైంది. ముగింపు వండర్‌ఫుల్‌ అనేలా చేసింది. ఇందులో మహేష్‌ `ఎంబీఫౌండేషన్‌` కోసం ఈ గేమ్‌ ఆడారు. అయితే ఇందులో Ntr, mahesh మధ్య చోటు చేసుకున్న సన్నివేశాలు, ఇద్దరి మధ్య డిస్కషన్‌ ఆద్యంతం నవ్వులు పూయించడం విశేషం. అంతేకాదు అనేక కొత్త విషయాలను మహేష్‌ ఇందులో వెల్లడించారు.

షోలో ఫస్ట్ నుంచి మహేష్‌ని అన్న అన్న అంటూనే ఆటపటిస్తున్నారు ఎన్టీఆర్‌. ఛాన్స్ దొరికితే మహేష్‌ని ఇరికించే ప్రయత్నం చేశాడు. కానీ మహేష్‌ తాను తక్కువ కాదని నిరూపించుకున్నారు. ఎన్టీఆర్‌.. లాజిక్కులతో కూడిన ప్రశ్నలను కంట్రోల్‌ చేస్తూ చేస్తూ వస్తున్నారు. అదే సమయంలో తమదైన స్టయిల్‌లో పంచ్‌లు వేశారు. మరోవైపు ఎన్టీఆర్‌ కూడా తానేమి తక్కువ కాదని మహేష్‌ని ఏదో రకంగా ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ఇలా ఇద్దరి మధ్య గేమ్‌ ఆద్యంతం నవ్వులు పంచిందని చెప్పొచ్చు. 


అయితే ఈ సందర్భంగా మహేష్‌ పలు ఇంట్రెస్టింగ్‌ విషయాలను పంచుకున్నారు. చిన్నప్పుడు తాను వీణ వాయించడం ఇష్టమని తెలిపారు. చాలా రోజులు వీణ వాయించేవాడట. కానీ ఇప్పుడు బిజీ లైఫ్‌ అయిపోయిందన్నారు. ఓ ప్రశ్నలో భాగంగా `మహాభారతం`లో ఏ పాత్ర అంటే మీకిష్టమని, ఏ పాత్రని చేయాలనుకుంటున్నారని మహేష్‌ని.. ఎన్టీఆర్‌ ప్రశ్నించగా, అందులో అన్ని ముఖ్యమైన పాత్రలే అని, ఇప్పుడు దాన్ని తీయడం మామూలు విషయం కాదని తన సమాధానం దాటవేసే ప్రయత్నం చేశాడు. అయితే మీకు కృష్ణుడి వేషం బాగా సూట్‌ అవుతుందని ఎన్టీఆర్‌ అనగా, చిన్న స్మైల్‌ ఇచ్చాడు మహేష్‌.

ఇద్దరి మధ్య పిల్లలు, కూతురికి సంబంధించిన చర్చ వచ్చింది. ఫాదర్‌ అనేదే ఒక అద్భుతమైన ఫీలింగ్‌ అని చెప్పాడు మహేష్‌. అయితే కూతురు లేని లోటు తనకు కనిపిస్తుందని ఎన్టీఆర్‌ తన మనసులోని ఫీలింగ్‌ని బయటపెట్టాడు ఎన్టీఆర్‌. ఎన్టీఆర్‌కి ఇద్దరు కుమారులు అభయ్‌ రామ్‌, భార్గవ్‌ రామ్‌ ఉన్నారనే విషయం తెలిసిందే. సాంగ్స్ గురించిన ప్రశ్న వచ్చినప్పుడు తాను సాంగ్స్ వినడం చాలా తక్కువ అని, ఓల్డ్ పాటలన్నీ ఇష్టమని తెలిపారు. తాను నటించిన చిత్రంలో `ఒక్కడు` సినిమాలోని పాటలంటే ఇష్టమని తెలిపాడు మహేష్‌. 

స్పోర్ట్స్ గురించి ప్రశ్న వచ్చినప్పుడు తనకు క్రికెట్‌ అంటే ఇష్టమన్నారు మహేష్‌. చిన్నప్పుడు బాగా ఆడేవాడట. ఆ తర్వాత మానేశానని, ఇప్పుడు ఆడటం కుదరడం లేదన్నారు. అయితే త్వరలో రాజమౌళితో సినిమా చేస్తున్నారుగా ఇక అన్ని ఆటలు ఆడిపిస్తారని తెలిపారు ఎన్టీఆర్‌. అన్ని ఆటలు సెట్‌లో చూపిస్తారని, ఆయన మామూలోడు కాదని స్వీట్‌గా హెచ్చరించాడు ఎన్టీఆర్‌. ఎన్టీఆర్‌ చెప్పిన దానికి తనదైన స్టయిల్‌లో స్మైల్‌తో కవర్‌ చేశారు మహేష్‌. అయితే అంతిమంగా అదొక అద్భుతమైన ఎక్స్ పీరియెన్స్ అన్నారు తారక్‌. 

పదివేల ప్రశ్న తర్వాత మహేష్‌.. ఎన్టీఆర్‌కి షాక్‌ ఇచ్చాడు. ఇంకా ఎన్ని ప్రశ్నలు డైరెక్ట్ గా కోటీ రూపాయల ప్రశ్న వేయండి అని తారక్‌ని అన్నాడు. దీంతో అలా కుదరదన్నాడు ఎన్టీఆర్‌. అయినా మహేష్‌ కోసం రూల్స్ బ్రేక్‌ చేసి మరీ కోటీ రూపాయల ప్రశ్న అన్నాడు. కానీ కంప్యూటర్‌ స్పందించలేదు. దీంతో మళ్లీ యదాతథంగా గేమ్‌ని కంటిన్యూ చేశారు. అయితే మహేష్‌ తాను అనుకున్న సమాధానాలు చెప్పగా, అది ఎలా కరెక్ట్ అని కూపీలాగే ప్రయత్నం చేస్తున్నాడు ఎన్టీఆర్‌. దీంతో ఎన్ని ప్రశ్నలు అడుగుతారంటూ, తాను చెప్పిన దాన్నిఫిక్స్ చేయండి, అది రైటా రాంగా అనే విషయం చెప్పండి అని తెలిపారు. అంతేకాని ఇలా ఒక్క ప్రశ్నకి ఇన్ని ఎక్ ట్రా ప్రశ్నలెందుకంటూ గట్టిగానే చెప్పాడు మహేష్‌. ఒక్కసారి కాదు మూడు నాలుగుసార్లు ఇలానే జరిగింది. 

హోస్ట్ కి సంబంధించి చర్చ వచ్చినప్పుడు తాను హోస్ట్ గా చేయలేనని, ఎన్టీఆర్‌ హోస్ట్ బాగుంటుందని తెలిపారు మహేష్‌. మరోవైపు బిర్యానికి సంబంధించిన చర్చ వచ్చినప్పుడు తనకు తన అమ్మమ్మ చేసిన వంటలంటే ఇష్టమని, ఆమె చనిపోయాక ఆ ఊరి వంటల రుచులను మిస్‌ అవుతున్నానని తెలిపారు. అయితే హైదరాబాద్‌ బిర్యానీ అంటే ఇష్టమని చెప్పారు. ఇంట్లో చప్పగా ఫుడ్‌ తీసుకుంటానని, కానీ అప్పుడప్పుడు కారంతో కూడిన వంటలు తినాలని, అందుకు బిర్యానీ ప్రిపర్‌ చేస్తానని చెప్పారు. 
 

హాలీడేస్‌ విషయానికి వచ్చినప్పుడు ఏడాదికి మూడు సార్లు హాలీడేస్‌ ప్లాన్‌ చేస్తానని, పిల్లల స్టడీ హాలీడేస్‌ సమయంలో అవి ప్లాన్‌ చేస్తానని, సమ్మర్‌, దసరా, క్రిస్మస్‌ హాలీడే్‌ సమయంలో విదేశాలకు వెళ్తామన్నారు. ఇలా హాలీడేస్‌ వెళ్లడం, పిల్లలతో మనకు ర్యాపో పెరుగుతుందని, ఆ రిలేషన్‌ మరింత ధృడమవుతుందన్నారు. తమ బిజీ లైఫ్‌లో ఇలాంటి సమయాల్లోనే పిల్లలతో టైమ్‌ కేటాయించడానికి ఛాన్స్ ఉంటుందన్నారు. 
 

తాను నటిస్తున్న `సర్కారు వారి పాట` గురించి చెబుతూ, పూరీ జగన్నాథ్‌ స్టయిల్‌లో ఈ సినిమా ఉంటుందని, ఓ `పోకిరి` ప్లేవర్‌లో ఉంటుందన్నారు. ఫస్ట్ టైమ్‌ చాలా వేరియేషన్స్ ఉన్న పాత్రని పోషిస్తున్నట్టు చెప్పారు. సినిమా చాలా బాగా ఉంటుందని, కచ్చితంగా మంచి సినిమా అవుతుందన్నారు. తాను నిర్మిస్తున్న `మేజర్‌` కూడా బాగా వచ్చిందని, అదొక అద్భుతమైన సినిమా అవుతుందన్నారు. నిర్మాణ బాధ్యతలు నమ్రత చూసుకుంటుందని తెలిపారు సూపర్‌ స్టార్‌ మహేష్‌. 
 

మీరు మల్టీస్టారర్‌ సినిమాలు ఎప్పుడు చేస్తారు? ఆ ఆలోచన ఉందా? అని ఎన్టీఆర్‌ ప్రశ్నించగా, ఇప్పుడున్న హీరోల మధ్య మంచి బాండింగ్‌ ఉందని, అంతా ఫ్రెండ్స్ గా ఉంటారని, ఆరోగ్యకరమైన వాతావరణం ఉందని, భవిష్యత్‌లో తెలుగు ఆడియెన్స్ మరిన్ని మంచి సినిమాలు చూడబోతున్నారని తెలిపారు. పరోక్షంగా మల్టీస్టారర్‌ సినిమాలు చాలా వస్తాయని చెప్పారు మహేష్‌. ఇక ఈ గేమ్‌లో మహేష్‌ 13వ ప్రశ్న వరకు ఆడారు. ఒక్క లైఫ్‌ లైన్‌ తీసుకుని రూ.25లక్షలు గెలుచుకున్నారు. దీంతో టైమ్‌ అయిపోయింది. ఈ సీజన్‌కి ముగింపు పలుకుతూ ఎన్టీఆర్‌ ఎమోషనల్‌ వర్డ్స్ చెప్పారు. ఈ షోని తాను, ఆడియెన్స్ చాలా మిస్‌ అవుతున్నట్టు చెప్పారు. ఆడియెన్స్ ని మిస్‌ అవుతున్నానని, ఈ హాట్‌ సీట్‌ని మిస్‌ అవుతున్నానని, ఈ షోని మిస్‌ అవుతానని, అందరి ప్రేమని మిస్‌ అవుతానని తెలిపారు ఎన్టీఆర్‌. ఎమోషనల్‌గా ముగింపు పలికారు. 

also read: Mahesh Babu with Balakrishna బాలయ్య తో మహేష్... బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ కి సిద్ధం కండి!

Latest Videos

click me!