బిగ్ బాస్ తెలుగు 10 పదో వారం మరింత ఆసక్తికరంగా మారింది. ఈ వారం ఫ్యామిలీ వీక్ కావడంతో కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి సందడి చేశారు. దీంతో కంటెస్టెంట్లు ఎమోషనల్ అయ్యారు. ఇక వీకెండ్ కావడంతో ఎలిమినేషన్ అనేది ఆసక్తికరంగా మారింది. మరి ఈ వారం ఎవరు బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. పదోవారం వంశీ తప్ప అందరు నామినేషన్‌లో ఉన్నారు. ముఖేష్, త్రిగుణ్, దేబ్జానీ, వర్షిణి, అమన్, నీతూ నటరాజ్, స్వేత, రామ్ ప్రసాద్, సుధీర్, నరేష్, రామకృష్ణ, శివకుమార్ నామినేషన్‌లో ఉన్నారు.