Dil Raju 2027 Movies: దిల్ రాజు ఈజ్ బ్యాక్..సల్మాన్ నుంచి దేవిశ్రీ వరకు, 2027లో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే

Published : Nov 14, 2026, 02:56 PM IST

నిర్మాత దిల్ రాజు 2027లో ఐదు భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, విజయ్ దేవరకొండ సినిమాలతో పాటు 'ఎల్లమ్మ', 'దేత్తడి' చిత్రాలను నిర్మిస్తున్నారు.

PREV
16
దిల్ రాజు

నిర్మాతగా కొంతకాలంగా వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న దిల్ రాజు ఇప్పుడు కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఐదు భారీ చిత్రాలను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా బాలీవుడ్ అగ్ర హీరోలతో చేస్తున్న సినిమాలతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలోనూ విభిన్నమైన కథలను ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమవుతున్నారు. 2027 ఫిబ్రవరి నుంచి మే మధ్యలో తమ నిర్మాణ సంస్థ నుంచి వరుసగా సినిమాలు విడుదల కానున్నట్లు తెలిపారు. ఈ సినిమాలతో దిల్ రాజు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వడం గ్యారెంటీ అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ ఐదు చిత్రాల వివరాలు..

26
సల్మాన్ ఖాన్ మూవీ

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా దిల్ రాజు ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం చివరి దశలో ఉంది. 2027 ఈద్ సందర్భంగా ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించారు. సల్మాన్ ఖాన్‌తో సినిమా చేయడం తన లైనప్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని దిల్ రాజు వెల్లడించారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు.

36
అక్షయ్ కుమార్ మూవీ

బాలీవుడ్ మరో స్టార్ హీరో అక్షయ్ కుమార్‌తోనూ దిల్ రాజు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని ఆయన స్పష్టం చేశారు. అన్ని కార్యక్రమాలు ముగించుకుని 2027 ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సల్మాన్ ఖాన్ సినిమాతో పాటు అక్షయ్ కుమార్ చిత్రం కూడా బాలీవుడ్‌లో తన నిర్మాణ సంస్థకు మంచి గుర్తింపు తీసుకొస్తుందని దిల్ రాజు ఆశిస్తున్నారు.

46
ఎల్లమ్మ

'బలగం' సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు యెల్దండి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఎల్లమ్మ'. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాతో హీరోగా పరిచయం కానున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చిందని దిల్ రాజు తెలిపారు. సంగీత దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన దేవి శ్రీ ప్రసాద్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై ఆసక్తి నెలకొంది.

56
రౌడీ జనార్దన

విజయ్ దేవరకొండతో దిల్ రాజు నిర్మిస్తున్న మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ 'రౌడీ జనార్దన'. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'ఫ్యామిలీ స్టార్' ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అయితే ఈసారి విజయ్‌ను పూర్తిగా భిన్నమైన మాస్ పాత్రలో చూపించబోతున్నట్లు దిల్ రాజు వెల్లడించారు. గతంలో చూడని విధంగా ఆయనను కొత్త అవతారంలో ప్రేక్షకులకు పరిచయం చేయనున్నట్లు చెప్పారు.

66
దేత్తడి

యువ హీరో ఆశిష్ ప్రధాన పాత్రలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం 'దేత్తడి'. ఈ సినిమాతో ఓ కొత్త దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం కానున్నారు. వైవిధ్యమైన కథాంశంతో ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నట్లు సమాచారం. తన నిర్మాణ సంస్థ నుంచి రాబోతున్న ఐదు చిత్రాల్లో ఈ సినిమా కూడా ఒకటిగా నిలవనుంది.

Read more Photos on
click me!

Recommended Stories