తమిళనాడు లాంటి బలమైన ప్రాంతీయ మార్కెట్‌లో 'రామాయణం' సాధిస్తున్న విజయాలు బాక్సాఫీస్ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తున్నాయి. పౌరాణిక కథాంశంతో పాటు యశ్ క్రేజ్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోందని చెబుతున్నారు.
తమిళనాడులోనూ 'రామాయణం' అదరగొడుతోంది. సూర్య సినిమా రికార్డును రణబీర్ సినిమా బ్రేక్ చేసింది!
బాక్సాఫీస్ వద్ద రోజురోజుకూ కొత్త మైలురాళ్లను అందుకుంటున్న రణబీర్ కపూర్ 'రామాయణం' ఇప్పుడు తమిళనాడులోనూ సత్తా చాటుతోంది. ఉత్తరాది కథ దక్షిణాది ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటోంది.
26
సూర్య నటించిన 'సీన్'కు పోటీ
ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. తమిళ హీరో సూర్య నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ 'సీన్'కు పోటీ ఇచ్చే స్థాయికి 'రామాయణం' ఎదిగింది. ఇప్పటికే తమిళనాడులో రూ.30 కోట్ల మార్క్ దాటిన ఈ సినిమా త్వరలోనే రూ.60 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.
36
సూర్య సీన్ ని వెనక్కి నెట్టేసిన రామాయణం
భాషా భేదాలు లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న 'రామాయణం' జోరుకు తాజా అడ్వాన్స్ బుకింగ్స్ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. శనివారం అడ్వాన్స్ బుకింగ్స్‌లో సూర్య 'సీన్' సినిమా కంటే 'రామాయణం' రెట్టింపు ముందంజలో ఉందని సమాచారం. తమిళంలో డబ్ అయి వచ్చిన హిందీ సినిమాకు ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం చిత్ర పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది.
తమిళనాడు లాంటి బలమైన ప్రాంతీయ మార్కెట్‌లో 'రామాయణం' సాధిస్తున్న విజయం బాక్సాఫీస్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. పౌరాణిక కథాంశం, భారీ నిర్మాణ విలువలు, రణబీర్ కపూర్ నటనతో పాటు యశ్ క్రేజ్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
56
సౌత్ ఇండియా మార్కెట్‌లోనూ
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1,100 కోట్లు రాబట్టిందని చెబుతున్న 'రామాయణం' భాషా, ప్రాంతీయ భేదాలు లేకుండా దూసుకెళ్తోంది. సౌత్ ఇండియా మార్కెట్‌లోనూ ఇంత భారీ స్పందన రావడం సినిమా క్రేజ్‌కు నిదర్శనం.
66
రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు
ఇదే జోరు కొనసాగితే తమిళనాడులో రూ.60 కోట్ల టార్గెట్ రీచ్ అవ్వడమే కాదు.. రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ ఎపిక్ మూవీ బాక్సాఫీస్ సునామీ ఎక్కడిదాకా వెళుతుందనే ఆసక్తి ఇప్పుడు నెలకొంది.