తెలుస్తోన్న సమాచారం ప్రకారం.. ఝాన్సీతోపాటు అమన్, ఆర్జే చరణ్, రోహిత్ నాయుడు, షాలిని, సృష్టి వ్యాకరణం కామనర్స్ కేటగిరిలో బిగ్ బాస్ తెలుగు 10 హౌజ్‌లోకి రాబోతున్నట్టు సమాచారం. వీరికి సంబంధించి ఓపెనింగ్‌లోనే క్లారిటీ రానుంది. అలాగే సెలబ్రిటీ విభాగంలో టెంపర్ వంశీ, త్రిగుణ్, రామ్ ప్రసాద్, జబర్దస్త్ నరేష్, దేబ్జానీ, వర్షిణి సౌందరాజన్, చైత్ర రాయ్, కృష్ణుడు, సుధీర్ రెడ్డి, ముఖేష్ గౌడ వంటి వారు రాబోతున్నారట. అలాగే గుండెనిండా గుడిగంటలు ఫేమ్ విష్ణు కూడా రాబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇది కూడా ఆదివారం సాయంత్రం క్లారిటీ రానుంది.