Bigg Boss 10: 11వ వారం ఓటింగ్‌ రిజల్ట్, టాప్‌లో ఉన్నది వీళ్లే.. ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది ఎవరంటే?

Published : Nov 20, 2026, 02:59 PM IST

Bigg Boss 10: బిగ్‌బాస్ తెలుగు 10 రసవత్తరంగా సాగుతుంది. 11 వారం చివరి దశకు చేరుకుంది. మరి ఈ వారం టాప్‌లో ఎవరు ఉన్నారు? డేంజర్‌లో ఎవరు ఉన్నారు? ఎలిమినేషన్‌కి ఛాన్స్ ఎవరికి ఉందనేది చూస్తే.

PREV
13
11వ వారం నామినేషన్‌లో ఉన్నది వీళ్లే

బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్‌ అనేక ట్విస్ట్ లు, టర్న్ లతో సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 11వ వారంలోకి అడుగుపెట్టిన ఈ షోలో ఎలిమినేషన్ పోరు మరింత ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం ఈ వారంలో త్రిగుణ్‌, ముఖేష్‌, దేబ్జానీ, అమన్‌, రామకృష్ణ, వార్షిణి, రామ్‌ ప్రసాద్‌, వంశీ, సుధీర్‌, శివ, నీతూ మాస్టర్‌ ఉన్నారు. మరి వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ అయ్యే అవకాశం ఉంది. ఎవరు ఓటింగ్‌లో టాప్‌లో ఉన్నారనేది చూస్తే.

ఈ వారం నామినేషన్లలో ఉన్న కంటెస్టెంట్లకు సంబంధించి బయటకు వచ్చిన ఓటింగ్ ట్రెండ్స్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా త్రిగుణ్‌, ముఖేష్ మధ్య టాప్ ప్లేస్ కోసం గట్టి పోటీ కనిపిస్తోంది. మరోవైపు కొంతమంది కంటెస్టెంట్లు తక్కువ ఓట్లతో డేంజర్ జోన్‌లో ఉన్నారు.

23
టాప్‌లో త్రిగుణ్‌.. ముఖేష్ గట్టి పోటీ!

అనధికారిక ఓటింగ్‌ ప్రకారం.. 11వ వారం ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం త్రిగుణ్‌ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. అతనికి 29.74 శాతం ఓట్లు నమోదయ్యాయి. రెండో స్థానంలో ఉన్న ముఖేష్ కూడా గట్టి పోటీ ఇస్తున్నాడు. అతనికి 28.96 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఇద్దరి మధ్య ఓట్ల వ్యత్యాసం చాలా తక్కువగా ఉండటం విశేషం. చివరి వరకు ఇదే పోటీ కొనసాగితే టాప్ ప్లేస్‌లో మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

మూడో స్థానంలో అమన్ ఉన్నాడు. అతనికి 7.73 శాతం ఓట్లు నమోదయ్యాయి. నాలుగో స్థానంలో దేభజాని 7.09 శాతం ఓట్లతో కొనసాగుతోంది. ఐదో స్థానంలో రామకృష్ణ 5.36 శాతం సాధించాడు.

ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా వర్షిణి, రాంప్రసాద్, వంశీ, సుధీర్ కొనసాగుతున్నారు. వర్షిణికి 4.59 శాతం, రాంప్రసాద్‌కు 4.54 శాతం, వంశీకి 4.36 శాతం, సుధీర్‌కు 4.25 శాతం ఓట్లు వచ్చాయి. వీరి మధ్య ఓట్ల వ్యత్యాసం కూడా పెద్దగా లేదు. దీంతో ఈ కంటెస్టెంట్ల స్థానాల్లో చివరి నిమిషంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది.

33
బాటమ్‌లో నీతూ.. శివ కూడా డేంజర్‌లోనే!

ఈ వారం ఓటింగ్ ట్రెండ్స్‌లో అత్యంత తక్కువ ఓట్లు సాధించిన కంటెస్టెంట్‌గా నీతూ నిలిచింది. ఆమెకు కేవలం 1.63 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. చివరి స్థానంలో కొనసాగుతోంది. ఆమెకు కొంచెం పైన శివ ఉన్నాడు. 1.74 శాతం ఓట్లతో పదో స్థానంలో ఉన్నాడు. ఈ ఇద్దరికీ మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే చాలా తక్కువ ఓట్లు రావడం గమనార్హం.

ఎలిమినేషన్ డేంజర్‌లో ఎవరున్నారు?

ప్రస్తుత ట్రెండ్స్‌ను పరిశీలిస్తే నీతూ, శివ అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారు. వీరితో పాటు సుధీర్, వంశీ, రాంప్రసాద్, వర్షిణి కూడా డేంజర్‌లోనే ఉండటంతో వీరిపై ఎలిమినేషన్ ఆసక్తిని పెంచుతోంది. అయితే ఓటింగ్‌ని బట్టే ఓటింగ్‌ ఉంటుందనేది నిజం కాదు. ఈ వారంలో నీతూ డేంజర్‌లో కనిపిస్తుంది. ఇదే మెయిన్‌ ఓటింగ్‌లో ఉంటే, నీతూ ఈ వారం హౌజ్‌ని వీడబోతుందని చెప్పొచ్చు. ఆమె కాకపోతే రామకృష్ణకి కూడా ఎలిమినేషన్‌ ఉచ్చు ఉంది. ఏం జరుగుతుందనేది రెండు రోజుల్లో తేలనుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories