Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సమంత - రాజ్ దంపతులు స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించారు. అంతే కాదు తమ గారాల కొడుకు పేరును కూడా వారు వెల్లడించారు. ఇంతకీ సమంత తనయుడి పేరేంటి?
టాలీవుడ్ నటి సమంత రూత్ ప్రభు జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఆమె, భర్త రాజ్ నిడిమోరు తమకు పండంటి మగబిడ్డ జన్మించినట్లు ప్రకటించారు. ఈ శుభవార్తతో అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు అభినందనలు తెలుపుతున్నారు. తమ బిడ్డకు ‘దేవ్ నిడిమోరు’ (Dev Nidimoru) అని పేరు పెట్టినట్లు సమంత వెల్లడించింది. ఈ వార్త ప్రస్తుతం అభిమానుల్లో ఆనందాన్ని నింపుతోంది.
24
నవంబర్ 19న జననం.. లేట్ గా ప్రకటించిన నటి
సమంత తన సోషల్ మీడియా ఖాతాలో నవజాత శిశువు ఫొటోను పంచుకుంటూ ఈ సంతోషకరమైన విషయాన్ని వెల్లడించింది. నవంబర్ 19, 2026న బిడ్డ జన్మించినట్లు ఆమె పోస్టులో పేర్కొంది. తమ కుమారుడికి దేవ్ నిడిమోరు అని పేరు పెట్టినట్లు తెలిపింది. బిడ్డ రాకతో తమ జీవితంలో ఎన్నడూ లేనంత ఆనందం నిండిందని ఆమె ఎమోషనల్ కామెంట్స్ చేసింది. . ఈ పోస్టు చూసిన అభిమానులు శుభాకాంక్షలతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
34
ప్రెగ్నెన్సీలో కూడా ఫిట్నెస్పై ప్రత్యేక శ్రద్ధ
సమంత తన గర్భధారణ ప్రయాణానికి సంబంధించిన ఎన్నో విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. గర్భిణిగా ఉన్న సమయంలోనూ వ్యాయామం, ఫిట్నెస్పై ఆమె చూపించిన శ్రద్ధ చాలామందిని ఆకట్టుకుంది. జిమ్లో వర్కవుట్లు చేస్తున్న వీడియోలు, గర్భధారణలో వివిధ దశలకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ తన ప్రయాణాన్ని అభిమానులకు తెలియజేశారు. తల్లిగా కొత్త బాధ్యతను స్వీకరించడానికి ఆమె ఎంతో ఉత్సాహంగా సిద్ధమయ్యారు.
సమంత, రాజ్ నిడిమోరు 2025 డిసెంబర్లో కోయంబత్తూరులోని ఈషా యోగా కేంద్రంలో ప్రైవేట్ వేడుకలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తమ వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువగా ప్రచారానికి దూరంగా ఉంచిన ఈ జంట, ఇప్పుడు తమ కుటుంబంలోకి కొత్త సభ్యుడి రాకతో ఆనందంలో మునిగిపోయారు. దేవ్ రాకతో వీరి జీవితాల్లో మరింత ప్రేమ, సంతోషం నిండాలని అభిమానులు కోరుకుంటున్నారు.