Varshini: వర్షిణి కూడా షాలినిలా మారుతోంది, నరేష్ చేసింది తప్పే.. కానీ అతడి ఛాలెంజ్ కి నాగ్ ఫిదా

Published : Nov 07, 2026, 11:11 PM IST

బిగ్ బాస్ షోలో శనివారం రోజు నాగార్జున వర్షిణి, దేబ్జానీ లకు క్లాస్ పీకారు. వర్షిణి క్రమంగా షాలినీలా మారుతోంది అని సెటైర్లు వేశారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

PREV
14
బిగ్ బాస్ తెలుగు 10

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో 62వ రోజు వీకెండ్ ఎపిసోడ్ హాట్ హాట్ గా సాగింది. నాగార్జున ఈ వారం ఒక్కొక్కరి ఆటని రివ్యూ చేస్తూ సరిగా ఆడని వాళ్ళకి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ముందుగా కెప్టెన్ అయిన వంశీని నాగ్ అభినందించారు. ఆ తర్వాత వంశీ, వర్షిణి వివాదం గురించి ప్రశ్నించారు. వర్షిణి ఒక మూలాన కూర్చుని కులుకుతూ ఉంటుంది అని అర్థం వచ్చేలా వంశీ కామెంట్స్ చేశారు. దానికి వర్షిణి సీరియస్ అయింది.

24
వర్షిణి మాటలతో పోల్చితే అది పెద్ద తప్పు కాదు

కులకడం అంటే తాను తప్పుడు మీనింగ్ తో అనలేదు అని వంశీ నాగార్జునకు చెప్పారు. తాను తప్పుడు మీనింగ్ తోనే అన్నాడు అని వర్షిణి నాగార్జునకు చెప్పింది. నాగార్జున స్పందిస్తూ.. వర్షిణి నువ్వు అన్న పి అండ్ బి మాటలతో పోల్చితే అదేం పెద్ద తప్పు కాదులే అంటూ ఆమెకే కౌంటర్ ఇచ్చారు. వంశీ అన్నమాట కాస్త అభ్యంతరకరమే.. కానీ వర్షిణి ఆ మాటని తప్పు అనడమే వింతగా ఉంది అంటూ నాగార్జున సెటైర్లు వేశారు. ఫుడ్ విషయంలో వర్షిణి నిర్లక్ష్యంగా ఉందనే విషయాన్ని కూడా నాగార్జున ప్రస్తావించారు. హౌస్ లో వర్షిణి క్రమంగా షాలినిలా మారుతోంది అంటూ సెటైర్లు వేశారు.

34
దేబ్జానీకి నాగ్ క్లాస్

ఆ తర్వాత నాగార్జున దేబ్జానీ కి క్లాస్ పీకారు. దేబ్జానీ గేమ్ ఆడుతున్నప్పుడు ముకేశ్ తో ప్రవర్తించిన విధానం ఏమాత్రం బాగాలేదని నాగార్జున అన్నారు. ముకేశ్ మగాడు కాదు అంటూ జెండర్ ని గేమ్ లో తీసుకురావడం చాలా పెద్ద తప్పు అని నాగ్ తెలిపారు. గేమ్ లో అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరూ సమానమే అని నాగార్జున అన్నారు.

44
పాపం నరేష్, శిక్ష తప్పలేదు

రివేంజ్ కి గురైన వాళ్ళు ఆడిన బ్యాలెన్స్ చేసే టాస్క్ కి నరేష్ సంచాలకుడిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. నరేష్ తప్పిదం వల్ల ముకేశ్, వర్షిణి గెలవకపోయినా గెలిచినట్లు ప్రకటించాడు. దీనితో అమన్, ఆర్కే నష్టపోయారు. నరేష్ సంచాలకుడిగా తప్పు చేశాడు. కానీ ఆ తప్పుని తాను స్వీకరించి.. తాను తప్పు చేసి ఉంటే తన ఫ్యామిలీని ఈ వీక్ వదులుకుంటాను అని ఛాలెంజ్ చేయడం బావుంది అని నాగార్జున అన్నారు. నరేష్ చేసింది తప్పే కాబట్టి ఈ వారం అతడు తన ఫ్యామిలీని కలుసుకోలేడు అని నాగార్జున తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories