Bigg Boss telugu 10: ముకేష్ గౌడ Vs శివ, ఇద్దరి మధ్య రగిలిన గొడవ, ముఖేష్ తీరుపై విమర్శలు..

Published : Oct 23, 2026, 10:21 PM IST

Bigg Boss telugu 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 1‌0 రోజుకో ట్విస్ట్ లతో .. రసవత్తరంగా కొనసాగుతోంది. వైల్డ్ కార్ట్స్ ఎంట్రీ తరువాత ఆట మరింతగా రక్తి కడుతోంది. తాజా ఎపిసోడ్ లో ముఖేష్, శివ మధ్య హోరా హోరీ నడిచింది. పెద్ద గొడవకు దారి తీసింది.

PREV
14
రసవత్తరంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 10

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా సాగుతోంది. హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య పోటీ రోజురోజుకు తారాస్థాయికి చేరుకుంటోంది. ముఖ్యంగా ఏడో వారంలో బిగ్ బాస్ హౌస్‌ను రెడ్, ఎల్లో, గ్రీన్ లెవెల్స్‌గా విభజించడం ఆటను మరింత ఉత్కంఠభరితంగా మార్చింది. రెడ్ లెవెల్ కంటెస్టెంట్లు మిడ్-వీక్ ఎలిమినేషన్‌కు గురికాగా, ఎల్లో జోన్‌లో ఉన్న వారు గ్రీన్ జోన్‌లోకి అడుగుపెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గ్రీన్ జోన్‌లోకి వెళ్లిన వారికి తదుపరి వారానికి ఇమ్యూనిటీ లభించడంతో, ఈ అవకాశం కోసం కంటెస్టెంట్లు హోరాహారీగా తలపడుతున్నారు. ఈ క్రమంలోనే ఎల్లో నుంచి గ్రీన్ లెవెల్‌కు మారేందుకు నిర్వహించిన కంటెంట్ టాస్క్‌లు, గేమ్‌లు హౌస్‌లో పెద్ద ఎత్తునే మంటలు రేపాయి.

24
సినిమా టైం అండ్ సౌండ్ రౌండ్స్

ఎల్లో నుంచి గ్రీన్‌లోకి వెళ్లే ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్ కంటెస్టెంట్లకు పలు రకాల ఆసక్తికరమైన ప్రశ్నలు, టాస్క్‌లు పెట్టారు. 'తడిసిన కేజీ పత్తి బరువు ఎక్కువ ఉంటుందా, లేక ఎండిన కేజీ పత్తి బరువు ఎక్కువ ఉంటుందా?' అనే ఆసక్తికరమైన ప్రశ్నకు ముకేష్ గౌడ పరిగెత్తుకుంటూ వచ్చి తడిసిన పత్తి బరువుగా ఉంటుందని తప్పుడు సమాధానం చెప్పాడు.

ఆ తర్వాత నరేష్ స్పందించి రెండూ ఒకే బరువుతో ఉంటాయని సరైన సమాధానం చెప్పి బోణీ కొట్టాడు. ఈ క్రమంలో డైనోసార్ బొమ్మను చూపించి అడిగిన ప్రశ్నకు నరేష్ తనదైన శైలిలో స్పందిస్తూ సందడి చేశాడు. అలాగే దోమ సౌండ్ రౌండ్, ఓజీ సినిమా టైటిల్ గుర్తింపు వంటి వివిధ రౌండ్లలో కంటెస్టెంట్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే ఈ సరదా వాతావరణం కాస్తా కొద్దిసేపటికే తీవ్ర వాగ్వాదాలకు, వ్యక్తిగత విమర్శలకు దారితీసింది.

34
బరువుల టాస్క్‌లో వ్యూహాలు - వివాదాలు

అగ్గిపుల్ల గీసే సౌండ్ రౌండ్ మరియు బరువులు మోసే కీలకమైన టాస్క్‌లో అసలు రచ్చ ప్రారంభమైంది. ప్రత్యర్థులను దెబ్బకొట్టడానికి ముకేష్ గౌడ ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. బరువులు పెట్టేటప్పుడు వాటిని ఒకే వైపు (వన్ సైడ్) వేయాలని, అలా చేస్తే ప్రత్యర్థులు బ్యాలెన్స్ చేయలేక కిందపడతారని తన గ్రూప్ సభ్యులకు ముకేష్ సలహా ఇచ్చాడు. సుధీర్ తదితరులు అమన్, శివ వంటి కంటెస్టెంట్లపై ఈ వ్యూహాన్నే అమలు చేశారు.

అప్పటికే దాదాపు 30 కేజీలకు పైగా బరువును మోస్తూ శివ సుదీర్ఘ పోరాటం చేసినప్పటికీ, ఈ టార్గెటెడ్ స్ట్రాటజీ కారణంగా చివరికి గేమ్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే, ముకేష్ టీమ్ ఏ వ్యూహాన్నైతే అమలు చేసిందో, సరిగ్గా అదే పద్ధతిని శివ కూడా తన టర్న్ వచ్చినప్పుడు ఫాలో అయ్యాడు. ముకేష్ వైపు బరువులు వేసేటప్పుడు మొత్తం ఒకే వైపునకు బ్యాగ్‌లను అమర్చాడు. దీనితో ముకేష్ ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయాడు.

44
తారాస్థాయికి చేరిన గొడవ - ముకేష్, శివ మాటల యుద్ధం

తనపై అదే స్ట్రాటజీ ప్రయోగించేసరికి ముకేష్ ఓటమిని జీర్ణించుకోలేకపోయాడు. శివతో వాదనకు దిగుతూ తీవ్ర పదజాలం వాడాడు. "నీకు సిగ్గుందా? విశ్వాసం లేదా? ఆత్మసాక్షిని అడుగు, నువ్వు తొండాట ఆడుతున్నావు" అంటూ వ్యక్తిగత విమర్శలకు దిగాడు. మరోవైపు శివ ఎంతో సంయలనంతో సమాధానం ఇస్తూ.. "మీ వాళ్లు కూడా అదే చేశారు కదా, నేను ఆడితే తప్పేంటి?" అని నిలదీశాడు. సంచాలక్‌గా వ్యవహరించిన వారి నిర్ణయాలపై కూడా కొద్దిసేపు గందరగోళం చెలరేగింది. ఈ వివాదం ముసలముద్రలా మారుతున్న తరుణంలో అమన్ జోక్యం చేసుకుని ఇద్దరినీ డిస్‌క్వాలిఫై చేస్తున్నట్లు ప్రకటించాడు.

'గుప్పెడంత మనసు' సీరియల్ హీరోగా బుల్లితెరపై ఎంతో మంది లేడీ ఫ్యాన్స్ ను, మంచి పేరు తెచ్చుకున్న ముకేష్ గౌడ.. బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చాక తన ఆట తీరుతో, కోపంతో రూడ్‌గా మారుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యూహాల పేరుతో వివాదాలు రాజేసుకోవడం, సహచర కంటెస్టెంట్లపై నోరు పారసుకోవడం ప్రేక్షకులను విస్మయానికి గురిచేస్తోంది. ఈ గోట్ టాస్క్ వివాదం రాబోయే రోజుల్లో హౌస్‌లో ఎలాంటి సమీకరణాలకు దారితీస్తుందో వేచి చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories