Bigg Booss 10 Contestants Remuneration: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ 16 మంది కంటెస్టెంట్లతో ఆదివారం సాయంత్రం గ్రాండ్‌గా ప్రారంభమైంది. మరి వీరిలో ఎక్కువ పారితోషికం ఎవరికి, అతి తక్కువ ఎవరు తీసుకుంటున్నారు.
బిగ్ బాస్ తెలుగు 10 హౌజ్‌లోకి క్రేజీ కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. బుల్లితెర స్టార్స్, కమెడీయన్స్, కామనర్స్ తో అదిరిపోయేలా ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్ కి కొదవ లేదని చెప్పొచ్చు. ఆదివారం(సెప్టెంబర్ 6)న సాయంత్రం గ్రాండ్‌గా ప్రారంభమైన విషయం తెలిసిందే. 16 మంది కంటెస్టెంట్లు ఇందులో పాల్గొన్నారు. కామనర్స్ నుంచి ఆరుగురు, సెలబ్రిటీ విభాగం నుంచి 10 మంది కంటెస్టెంట్లు వచ్చారు. మరి బిగ్ బాస్ కంటెస్టెంట్ల పారితోషికాలు ఎంత? ఎవరు ఎక్కువ తీసుకుంటున్నారు? ఎవరికి తక్కువ అనే వివరాలు చూస్తే..
27
అత్యధిక పారితోషికం ముఖేష్ గౌడకే
ఈ సీజన్‌లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న కంటెస్టెంట్లలో ముఖేష్ గౌడ పేరు ముందు వరుసలో వినిపిస్తోంది. `గుప్పెడంత మనసు` సీరియల్‌తో రిషి సార్‌గా పాపులర్ అయిన ముఖేష్ కి బుల్లితెరపై మంచి ఫాలోయింగ్. బుల్లితెర స్టార్‌గా రాణిస్తున్నారు. దీంతో ఆయన భారీగా డిమాండ్ చేశారట. ఈ లెక్కన ఆయనకు వారానికి నాలుగు లక్షలు చెల్లించేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు రెడీ అయినట్టు సమాచారం.
37
రామ్ ప్రసాద్ పారితోషికం ఎంతంటే?
ముఖేష్ గౌడ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే కంటెస్టెంట్ ఆటో రామ్ ప్రసాద్ అని సమాచారం. ఆయనకు వారానికి రూ.3.5 లక్షల నుంచి నాలుగు లక్షల వరకు చెల్లిస్తున్నారని సమాచారం. జబర్దస్త్ కామెడీ షోతో రామ్ ప్రసాద్ పాపులర్ అయిన విషయం తెలిసిందే. స్టార్ కమెడియన్‌గా రాణిస్తున్నారు. సినిమాలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ కేటగిరిలో ఆయన్ని బిగ్ బాస్ కి తీసుకోవడం విశేషం.
వీరితోపాటు యాంకర్ వర్షిణి సౌందరాజన్ కి గట్టిగానే చెల్లిస్తున్నారట. ఆమెకి వారానికి రూ.3.5 నుంచి 3.75 వరకు ఇస్తున్నట్టు సమాచారం. గ్లామర్ యాంగిల్‌లో ఆమెని తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే గతంలోనూ రెండు మూడుసార్లు ఆమె పేరు వినిపించింది. కానీ రాలేదు. ఇన్నాళ్లకి పదో సీజన్‌లో ఆమె షోకి రావడం విశేషం.
57
అందాల భామ దేబ్జానీ రెమ్యూనరేషన్ డిటెయిల్స్
బెంగాలీ అమ్మడు.. సీరియల్ నటి `దేబ్జానీ మోదక్ బిగ్ బాస్ లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. టీవీ సీరియల్స్ తో ఆకట్టుకున్న ఆమె బుల్లితెరపై మంచి ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుంది. తాను బిగ్ బాస్ షోకి రావడం విశేషంగా చెప్పొచ్చు. ఆమెకి వారానికి మూడు లక్షల పారితోషికం ఇస్తున్నారట.
67
కామనర్స్ పారితోషికం వివరాలు
ఇక కామనర్స్ గా వచ్చిన సింగర్ ఝాన్సీ, షాలినీ దామెర, ఆర్జే చరణ్, అమన్, సృష్టి, రోహిత్ నాయుడు వంటి కంటెస్టెంట్లకి సమానంగా వారానికి మూడు లక్షల పారితోషికం ఇస్తున్నారట. వీరితోపాటు నటుడు కృష్ణుడు, త్రిగుణ్‌లకు కూడా మూడు లక్షలు ఇస్తున్నట్టు సమాచారం.
77
అతి తక్కువ పారితోషికం ఎవరికంటే?
వీరితోపాటు జబర్దస్త్ నరేష్ కి, చైత్ర రాయ్‌లకు రూ.2.25లక్షలు, టెంపర్ వంశీ, యాంకర్ సుధీర్‌రెడ్డిలకు రెండు లక్షలు ఇస్తున్నారట. అతి తక్కువ అంటే టెంపర్ వంశీ, సుధీర్ రెడ్డిలకే అని చెప్పొచ్చు. ఇక ఈ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జునకి దాదాపు రూ.40కోట్లు ఇస్తున్నారని సమాచారం.