
బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ సంచలనాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. అదే సమయంలో ట్రోల్స్ కి గురవుతుంది. ఈ సీజన్‌లో బిగ్ బాస్ హౌజ్‌లో అనేక ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అదే సమయంలో ట్విస్ట్ లు, టర్న్ లతోనూ సాగుతుంది. మొదటి వారం ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. ఆ తర్వాత ఒకరు హౌజ్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. రెండో వారం ఏకంగా కృష్ణుడిని ఇంటికి పంపించారు. మూడో వారం కామనర్‌గా వచ్చి, కేవలం మూడో వారంలోనే హౌజ్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన మిథిలేష్ ఏకంగా రూ.15లక్షల సూట్ కేసు తీసుకొని వెళ్లిపోయాడు. నాల్గో వారం శ్రష్టి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే మూడో వారం హౌజ్‌ని వీడిన మిథిలేష్‌కి సంబంధించి ఇప్పుడు నెగటివ్ ప్రచారం జరుగుతుంది. ఆయన చేస్తున్న పనులు హాట్ టాపిక్ అవుతున్నాయి. అది బిగ్ బాస్ షోకి బ్యాడ్ ఇమేజ్‌ని క్రియేట్ చేస్తుండటం గమనార్హం. కామనర్‌గా మూడో వారంలో హౌజ్‌లోకి వచ్చి, కేవలం రెండు రోజులు మాత్రమే హౌజ్‌లో ఉండి, ఏకంగా పదిహేను లక్షలు తీసుకొని వెళ్లిపోయాడు మిథిలేష్. దీంతో మిథిలేష్ ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. ఆయన గురించి బాగా చర్చ జరిగింది. మిథిలేష్ జాక్ పాట్ కొట్టాడు, రెండు రోజులకే పదిహేను లక్షలు సంపాదించాడంటూ అంతా ప్రశంసించాడు. వాడు తోపురా అంటూ కామెంట్లు పెట్టారు. ఇది మిథిలేష్‌కి ఒక్కసారిగా పాపులారిటీని తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు ఆయన చేస్తున్న పనులు, ఆయనకు సంబంధించి బయటకు వస్తున్న వార్తలు షాక్ కి గురి చేస్తున్నాయి. ఇవి అతనికి నెగటివ్ కావడమే కాదు, బిగ్ బాస్ షో పరువు కూడా పోతుంది.
బిగ్ బాస్ షోకి రావడమే పాపులారిటీ, గుర్తింపు కోసం. తామేంటో నిరూపించుకోవడం కోసం. దీనికి రావడం డబ్బుల కోసం కాదు. కొందరికి డబ్బుల అవసరం ఉండొచ్చు, కానీ దానికి మించిన గుర్తింపు, తమ వ్యక్తిత్వం చాలా ముఖ్యం. ఈ షో ద్వారా వచ్చే గుర్తింపు, పాజిటివిటీ చాలా పనిచేస్తుంది. దాన్ని వాడుకొని లైఫ్‌లో సెట్ కావచ్చు. వాళ్లొక సెలబ్రిటీగా మారిపోతారు. అయితే అది పాజిటివ్‌గా ఉంటేనే, అదే నెగటివ్ యాంగిల్‌లో పోట్రే అయితే మాత్రం మన చుట్టూ ఉన్నవాళ్లే ఛీ కొట్టే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మిథిలేష్ విషయంలో అదే జరుగుతుంది. హౌజ్‌లో ఏం ఆడావని అంత డబ్బు తీసుకొని వచ్చావని, కేవలం స్వార్థం కోసమే మిథిలేష్ అలా చేశాడని, ఆయన బిగ్ బాస్ పరువు తీశారని అంటున్నారు.
అంతేకాదు ఇప్పుడు మిథిలేష్‌కి సంబంధించి మరో షాకింగ్ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హౌజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు మీడియా సంస్థలు ఇంటర్వ్యూల కోసం ఆయన్ని అప్రోచ్ అవుతుండగా, తను డబ్బులు డిమాండ్ చేస్తున్నాడట. ఒక్కో ఇంటర్వ్యూ కి రూ.15వేల నుంచి ఇరవై వేల వరకు డిమాండ్ చేస్తున్నాడట. ఇటీవల పలు యూట్యూబ్ ఛానెళ్లకి ఆయనకు ఇంటర్వ్యూలిచ్చారు. వాటి వద్ద కూడా డబ్బులు తీసుకొనే ఇంటర్వ్యూలు ఇచ్చాడట. ఓ యాంకర్ ఏకంగా ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశాడు. ఇలా పలు యూట్యూబ్ ఛానెళ్లకి ఎదురయ్యింది. పీఆర్‌లకు కూడా ఇలానే ఝలక్ ఇచ్చారట మిథిలేష్ టీమ్. దీంతో వాళ్లంతా సైలెంట్ అవుతున్నారు.
ఈ క్రమంలోనే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తుంది. ఇలాంటి వాళ్లని బిగ్ బాస్‌కి ఎందుకు తీసుకొస్తున్నారని, డబ్బుల కోసం కక్కుర్తి పడే వాళ్లని తీసుకొచ్చి బిగ్ బాస్ నిర్వాహకులు షోకి ఉన్న క్రెడిబులిటీని దెబ్బతీస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. మిథిలేష్‌పై జరిగే ప్రచారం.. బిగ్ బాస్ షోకి బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ కావడమే కాదు, కామనర్ విభాగంలో వచ్చే వారికి కూడా నెగటివ్ ఇమేజ్ క్రియేట్ అవుతుందని అంటున్నారు. మొత్తంగా మిథిలేష్ డబ్బుల కోసం కక్కుర్తి పడి ఇప్పుడు తన పరువు పోగొట్టుకోవడమే కాదు, బిగ్ బాస్ ఇమేజ్ కూడా డ్యామేజ్ చేస్తున్నాడని చెప్పొచ్చు. మరి మిథిలేష్ డబ్బులు డిమాండ్ చేస్తున్నాడనే వార్తల్లో నిజం ఏంటనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ ప్రచారం మాత్రం సోషల్ మీడియాలో గట్టిగా జరుగుతుంది.