అక్కినేని నాగేశ్వరరావు ది నాగు పాము పగ అని తెలిపారు రైటర్ ఎస్వీ రామారావు. సూపర్ స్టార్ కృష్ణ, సారథి స్టూడియో వాళ్లు చేసిన పనికి ఆయన కక్ష పెంచుకున్నాడని వెల్లడించారు. మరి ఇంతకి ఏం జరిగిందంటే?
అక్కినేని నాగేశ్వరరావు టాలీవుడ్ లో లెజెండరీ నటుడు. ఎన్టీఆర్‌కి ధీటుగా సినిమాలు చేసి మెప్పించారు. తనకంటూ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు. మైథలాజికల్ చిత్రాలతో ఎన్టీఆర్ దుమ్మురేపితే.. సోషల్ సినిమాలతో ఏఎన్నార్ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు. అలుపెరగని బాటసారిగా రాణించారు. అయితే ఏఎన్నార్ కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. వ్యాపారాల్లోనూ రాణించారు. ఆయన అన్నపూర్ణ స్టూడియోస్‌ని స్థాపించారు. ఇది ఇండియాలోనే పెద్ద స్టూడియోస్‌లో ఒకటిగా నిలిచింది. ఫిల్మ్ స్కూల్‌ని స్టార్ట్ చేశారు. సినిమాకి సంబంధించిన అన్ని పనులు తమ స్టూడియోలోనే కంప్లీట్ చేసుకునేలా ఈ స్టూడియోని తీర్చిదిద్దారు.
24
అన్నపూర్ణ స్టూడియో నిర్మాణం వెనుక ఏఎన్నార్ పగ
అయితే అక్కినేని నాగేశ్వరరావు ఈ స్టూడియో నిర్మాణం వెనుక పెద్ద కథే ఉంది. ఆయన ఒక విషయంలో తనకు అవమానం జరగడంతో.. పగతో ఈ స్టూడియోని నిర్మించారు. అటు హీరోపై పగ, మరోవైపు మరో స్టూడియోపై పగ. ఈ రెండు కలిపి అన్నపూర్ణ స్టూడియో నిర్మాణానికి కారణమయ్యాయని చెప్పొచ్చు. మరి ఆ కథేంటో చూస్తే, ఏఎన్నార్ చేసిన `దేవదాస్` మూవీ సంచలనం విజయం సాధించింది. అది రీ రిలీజ్ చేసినా కూడా పెద్ద హిట్ అయ్యింది. ఈ విషయాన్ని ప్రముఖ సినీ చిత్రకారుడు, రైటర్ ఎస్వీ రామారావు వెల్లడిస్తూ.. ఏఎన్నార్ ది నాగుపాము పగ అంటూ కామెంట్ చేశారు. అది ఎందుకో కూడా వివరించారు. మరి ఆయన ఏం చెప్పారంటే?
34
కృష్ణ దేవదాస్ కి పోటీగా ఏఎన్నార్ దేవదాస్ రిలీజ్
ఏఎన్నార్ `దేవదాస్` వచ్చిన కొన్నాళ్లకి సూపర్ స్టార్ కృష్ణ అదే పేరుతో, అదే కథతో మరో `దేవదాస్` మూవీ రూపొందించారు. తనే నటించాడు. ఈ సినిమా రిలీజ్ టైమ్‌లో ఏఎన్నార్ అమెరికాలో ఉన్నారు. అనారోగ్యం కారణంగా ఆయన అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. ఆ సమయంలో కృష్ణ దేవదాస్ రిలీజ్‌కి పోటీగా స్థానిక నిర్మాతలు ఏఎన్నార్ `దేవదాస్`ని రిలీజ్ చేశారు. దీని కారణంగా .. కృష్ణ `దేవదాస్` కిల్ అయ్యింది. ఆ మూవీని ఎవరూ పట్టించుకోలేదు. మళ్లీ ఏఎన్నార్ `దేవదాస్`నే ఎక్కువగా చూశారు. అది మరోసారి పెద్ద హిట్ అయ్యింది. అయితే కృష్ణ దేవదాస్ మూవీని నవయుగ వాళ్లు, సారథి స్టూడియో వాళ్లు నిర్మించారు. `దేవదాస్` విషయంలో సారథి వాళ్లు హర్ట్ అయ్యారు. ఆ తర్వాత అంజలిదేవి రూపొందించాల్సిన ఏఎన్నార్ సినిమాకి సారథి వాళ్లు షూటింగ్‌కి ఒప్పుకోలేదు.
అప్పట్లో ఏఎన్నార్ సినిమాలన్నీ సారథి స్టూడియోలోనే షూటింగ్ అయ్యేవి. ఇప్పుడు వాళ్లు నో చెప్పారు. దీంతో తన సినిమాలు ఎక్కడ తీయాలో అర్థం కాలేదు. దీంతో తనకే ఒక స్టూడియో ఉంటే బాగుంటుందని చెప్పి, పెద్దలను, రాజకీయ నాయకులను పట్టుకొని స్టూడియో నిర్మాణానికి ప్లేస్ కెటాయించుకున్నారు. స్టూడియోకి పర్మిషన్ కూడా వచ్చింది. అలా కేవలం 4 నెలల్లోనే స్టూడియో నిర్మాణం పూర్తి చేశారట. ఆ తర్వాత కొత్త సినిమాని షూటింగ్ స్టార్ట్ చేయించారట. అటు కృష్ణపై పగ, ఇటు సారథి వాళ్లపై ప్రతీకారం ఈ స్టూడియో నిర్మాణానికి దారి తీసింది. కాకపోతే ఈ ప్రతీకారం నిర్మాణాత్మకమైన రివేంజ్ అని తెలిపారు ఎస్వీ రామారావు. ఇలాంటి విషయాల్లో పెద్ద వాళ్ల నుంచి మనం నేర్చుకోవాలని, అది నెగటివ్ వేలో కాదు, పాజిటివ్‌గా అని తెలిపారు రైటర్. ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు ఎస్వీ రామారావు. ఇదిప్పుడు వైరల్‌గా మారింది.