బుల్లితెరపై కామెడీ షోలతో ఆకట్టుకున్న ఎక్స్ ప్రెస్ హరి, అలాగే నటి సోనియా సింగ్, తేజస్విని, మంగ్లీ, యాంకర్ నిఖిల్, ఇన్‌ఫ్లూయెన్సర్ నందు, రమణ వంటి వారు రాబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. అయితే బిగ్ బాస్ కి సంబంధించిన చాలా మంది పేర్లు వినిపిస్తుంటాయి. కానీ ఎంపిక వచ్చేసరికి చాలా పేర్లు మారిపోతాయి. ఎవరు ఫైనల్ అవుతారనేది ఇప్పుడు తేల్చలేం. పారితోషికాలు, కాల్షీట్లు, మిగిలిన రూల్స్ అండ్ రెగ్యూలేషన్స్ మీద వీరి ఎంపిక ఆధారపడి ఉంటుంది. ఆగస్ట్ మూడో వారంలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక అగ్నిపరీక్షని ఆగస్ట్ లో నిర్వహించనున్నారు. అందులోనుంచి కొంత మందిని, సెలబ్రిటీలు మరికొంత మందిని కలిపి మొత్తంగా ఇరవై మంది సెలబ్రిటీలను హౌజ్‌లోకి పంపిస్తారు. ఇది సెప్టెంబర్ మొదటి ఆదివారం ప్రారంభం కానుంది. ఎప్పటిలాగానే నాగార్జున దీనికి హోస్ట్ గా చేయనున్నారు.