Kiran Abbavaram: `క` సినిమా కలెక్షన్ల వివాదంపై నిర్మాతకు కిరణ్‌ అబ్బవరం కౌంటర్‌.. వసూళ్లు ఫేకా నిజమా

Published : Jul 15, 2026, 06:53 PM IST

Kiran Abbavaram: కిరణ్‌ అబ్బవరం నటించిన `క` సినిమాకి పెద్దగా కలెక్షన్లు రాలేదని నిర్మాత ఆ మధ్య కామెంట్‌ చేసిన నేపథ్యంలో దానికి కౌంటర్‌ ఇచ్చాడు కిరణ్‌ అబ్బవరం.

PREV
15
చెన్నై లవ్‌ స్టోరీతో రాబోతున్న కిరణ్‌ అబ్బవరం

యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం ఆ మధ్య `క` మూవీతో మంచి కమ్ బ్యాక్‌ ఇచ్చాడు. వరుస పరాజయాల్లో ఉన్న తనకు హిట్‌ ఇచ్చింది. బౌన్స్ బ్యాక్‌ అయ్యేలా చేసింది. ఆ తర్వాత `కే ర్యాంప్‌`తో మరో విజయాన్ని అందుకున్నాడు కిరణ్‌ అబ్బవరం. వరుసగా విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు ఆయన `చెన్నై లవ్‌ స్టోరీ`తో రాబోతున్నారు. ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి రవి నబ్బూరి దర్శకత్వం వహించగా, శ్రీగౌరీ ప్రియా హీరోయిన్‌గా నటిస్తోంది. సిరిహన్మంతు కీలక పాత్ర పోషిస్తుంది.

25
క మూవీ వివాదంపై కిరణ్‌ అబ్బవరం రియాక్షన్‌

ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా, అలాగే నేడు తన పుట్టిన రోజు సందర్భంగా కిరణ్‌ అబ్బవరం మీడియాతో మాట్లాడాడు. ఇందులో `క` మూవీ ప్రస్తావన వచ్చింది. గతంలో ఓ ప్రెస్‌ మీట్‌లో `క` మూవీ నిర్మాత చింతా గోపాలకృష్ణా రెడ్డి మాట్లాడుతూ, ఆ సినిమాకి పెద్దగా లాభాలు రాలేదని కామెంట్‌ చేశారు. పెట్టిన బడ్జెట్‌ ఎంత, వచ్చిన కలెక్షన్లు ఎంతా అంటూ మాట్లాడారు. బ్లాక్‌ బస్టర్‌గా చెప్పుకున్న `క` మూవీకి కలెక్షన్లు గొప్పగా రాలేదనే కోణంలో మాట్లాడారు. దీనికి సంబంధించిన ప్రశ్న కిరణ్‌ అబ్బవరంకు ఎదురయ్యింది.

35
క నిర్మాతకు కిరణ్‌ అబ్బవరం కౌంటర్‌

ఈ సందర్భంగా కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ, ఇప్పుడు ఒక సినిమాకి వంద కోట్ల పోస్టర్‌ వేసినా, నిజంగానే వంద కోట్లు కలెక్ట్ చేసినా, నిజంగా నిర్మాతకు వచ్చేది ఎంత? దాని హిట్‌ మోతాదు ఎంత ఉంటుంది? అయినా ఆ మూవీని ముందుగానే అమ్మేశాం. వేరే డిస్ట్రిబ్యూషన్‌కి ఇచ్చేశాం. వాళ్ల పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో కలెక్షన్లు వేరుంటాయి. అయినా `క` సినిమాకి ఆన్‌ రికార్డ్ ఎంత వచ్చాయనేది లెక్కలుంటాయి. అందులోనే నిజం తెలుస్తుంది` అని తెలిపారు కిరణ్‌ అబ్బవరం. పోస్టర్‌ వేసినంత మాత్రాన అంత కలెక్షన్లు నిర్మాతకు రావు అని, అదే సమయంలో సినిమాని వేరే వాళ్లకి అమ్మిన నేపథ్యంలో వచ్చిన కలెక్షన్లు తమకు సంబంధం ఉండదు కదా అనే కోణంలో కిరణ్‌ అబ్బవరం మాట్లాడారు.

45
సినిమా హిట్‌ అవ్వడం వేరు, కలెక్షన్లు వేరు-ఎస్‌కేఎన్‌

దీనిపై నిర్మాత ఎస్‌కేఎన్‌ స్పందించారు. ఇప్పుడు ఒక సినిమా హిట్‌ అయిన బాగా కలెక్షన్లు వచ్చినా, అవి నిర్మాత వద్దకు రావడానికి చాలా టైమ్‌ పడుతుంది. దానికి చాలా ప్రాసెస్‌ ఉంటుంది. ఇప్పటికీ `బేబీ` మూవీకి కొన్ని ఏరియాల్లో ఇంకా రాలేదని తెలిపారు. సినిమా సక్సెస్‌ కావడం వేరు, డబ్బులు బ్యాక్‌ రావడం వేరు అన్నారు. ఆ సినిమా చాలా ప్రేమని పొందింది. ఆ ప్రేమనే కొలమానంగా చెప్పుకుందాం అని వెల్లడించారు.

55
చెన్నై లవ్‌ స్టోరీ గురించి కిరణ్‌ కామెంట్‌

ఇక చెన్నై లవ్‌ స్టోరీ గురించి చెబుతూ, ఇదొక సరికొత్త ప్రేమ కథ అని, నేటి ట్రెండ్‌కి బాగా కనెక్ట్ అవుతుందన్నారు. తొలి ప్రేమనే గొప్ప కాదు, సెకండ్‌ లవ్‌ ఇంకా గొప్పదని చెప్పేకథాంశంతో ఈ మూవీ సాగుతుందని, చెన్నై బేస్డ్ గా ఈ సినిమా సాగుతుందని, దానికి ఓ కారణం ఉంటుందని, అందుకే ఈ మూవీకి ఆ టైటిల్‌ని పెట్టినట్టు తెలిపారు రైటర్‌ సాయి రాజేష్‌. `ఈ చిత్రంలో ప్యూర్ లవ్ చూస్తారు. సినిమా మొత్తం నేను హీరోయిన్ ను అండి, మీరు అనే పిలుస్తాను. అంత గౌరవిస్తాను. మూవీలో నటిస్తున్నప్పుడు ఒక అమ్మాయిని ఇంతలా ప్రేమించవచ్చా, ఇంతలా ట్రీట్ చేయవచ్చా అనిపించింది. మా మూవీలోని సీన్స్ కు మీరు బాగా రిలేట్ అవుతారు. చెన్నై లవ్ స్టోరీ పాటలు చూసి మీరు క్లాస్ అనుకుంటున్నారు. కానీ ఇది ప్రాపర్ మాస్ మూవీ. ఈ సినిమాలోని క్యారెక్టర్స్ , వాటి నేపథ్యం సాలిడ్ మాస్ తో ఉంటాయి. డైలాగ్స్, స్టోరీలోని బ్లాక్స్ మాస్ కే ఎక్కువ కనెక్ట్ అవుతాయి` అని కిరణ్‌ అబ్బవరం తెలిపారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories