Allari Naresh: అల్లరి నరేష్ ఇంత పెద్ద సూపర్ హిట్స్ రిజెక్ట్ చేశాడా.. ఆ ఇద్దరు హీరోల పంట పండింది

Published : Sep 13, 2026, 07:56 PM IST

అల్లరి నరేష్ తన కెరీర్ లో రెండు సూపర్ హిట్ సినిమాలు రిజెక్ట్ చేశారు. ఆ సినిమాలు చేసిన హీరోల పంట పడింది అనే చెప్పాలి. అల్లరి నరేష్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

PREV
15
అల్లరి నరేష్

అల్లరి నరేష్ తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. అల్లరి నరేష్ కి కామెడీ చిత్రాలు బాగా కలసి వచ్చాయి. రాజేంద్ర ప్రసాద్ తర్వాత అంత అద్భుతంగా టాలీవుడ్ లో కామెడీ సినిమాలు చేయగలిగిన హీరో అంటే ఎవరైనా అల్లరి నరేష్ పేరే చెబుతారు. ఇటీవల చిన్న బ్రేక్ తీసుకున్న అల్లరి నరేష్ మళ్ళీ కెరీర్ లో జోరు పెంచారు. కామెడీ సినిమాలతో పాటు సీరియస్ మూవీస్ కూడా చేస్తున్నారు.

25
అల్లరి నరేష్ రిజెక్ట్ చేసిన మూవీస్

లెజెండ్రీ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ కుమారుడిగా అల్లరి నరేష్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల ఇంటర్వ్యూలో అల్లరి నరేష్ తన కెరీర్ లో రిజెక్ట్ చేసిన సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా కెరీర్ లో పెద్దగా రిగ్రెట్స్ ఏమీ లేవు. నాకు సెట్ కావు అనిపించినవి నేను చేయలేదు.

35
కామెడీ సినిమాలే చేయమన్నారు

సుడిగాడు తర్వాత కార్తికేయ మూవీ స్టోరీ నాకే చెప్పారు. అప్పటికి నా కమిట్మెంట్స్ చాలా ఉన్నాయి. నేను చేయలేను అని చెప్పా. ఒక్కసారి కథ వినండి.. వింటే ఏదో విధంగా మీరే డేట్లు అడ్జెస్ట్ చేస్తారు అని చెప్పారు. కథ వింటే చాలా బాగా నచ్చింది. కనై సీరియస్ ఫిలిం. ఆ టైంలో చాలా మంది నువ్వు కామెడీ సినిమాలే చేయి, సీరియస్ వద్దు అని సలహా ఇచ్చారు. దాసరి నారాయణరావు కూడా అదే చెప్పారు.

45
పాములంటే భయం

దీనికి తోడు ఆ సినిమాలో పాముల సన్నివేశాలు ఉంటాయి. పాములు అంటే నాకు చాలా భయం. ఈ కారణాల వల్ల ఆ సినిమాని రిజెక్ట్ చేశాను అని అల్లరి నరేష్ పేర్కొన్నారు. కార్తికేయ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దానికి సీక్వెల్ గా వచ్చిన కార్తికేయ 2 పాన్ ఇండియా సూపర్ హిట్ అయింది. నేను రిజెక్ట్ చేసిన మరో చిత్రం గుండెజారి గల్లంతయ్యిందే. దాంట్లో ఫన్ ఉంది. కానీ దానికంటే ఎక్కువ లవ్ ఉంది. నన్ను నేను ఎప్పుడూ లవర్ బాయ్ లా ఊహించుకోలేదు.

55
నితిన్ పంట పండింది

అంత సీరియస్ లవ్ నామీద వర్కౌట్ కాదు అని అనిపించింది. అందుకే ఆ సినిమాని కూడా రిజెక్ట్ చేసినట్లు అల్లరి నరేష్ తెలిపారు. ఆ సినిమాని నితిన్ చేయడం కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కావడం జరిగింది. ఇష్క్ తో కంబ్యాక్ ఇచ్చిన నితిన్ కెరీర్ కి ఈ మూవీ మరింత బూస్ట్ ఇచ్చింది.

Read more Photos on
click me!

Recommended Stories