Bigg Boss Telugu 10: ఆరో వారం ఓటింగ్‌ రిజల్ట్.. ఎలిమినేట్‌ అయ్యేది ఆమెనే?

Published : Oct 17, 2026, 05:15 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఆరో వారం ఓటింగ్‌ రిజల్ట్ వచ్చింది. ఈ వారంలో షాకింగ్‌ కంటెస్టెంట్‌ హౌజ్‌ని వీడబోతున్నారట. తాజాగా దీనికి సంబంధించిన వార్త లీక్‌ అయ్యింది.

PREV
13
ఆరో వారం నామినేషన్‌లో ఆరుగురు కంటెస్టెంట్లు

బిగ్‌ బాస్‌ తెలుగు 10వ సీజన్‌ గత వారమే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ఐదుగురు కంటెస్టెంట్లు హౌజ్‌లోకి అడుగుపెట్టారు. కొత్తగా రామకృష్ణ, నీతూ నటరాజ్‌, దక్షి, శ్వేత నాయుడు, శివ కుమార్‌ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. గత వారం చరణ్‌, అపూర్వ ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఆరో వారంలో అమన్‌, రామ్‌ ప్రసాద్‌, షాలిని, వంశీ, వర్షిణి, రోహిత్‌ నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.

23
షాలిని ఎలిమినేషన్‌

ఈ క్రమంలో ఆరో వారంలో ఎలిమినేషన్‌కి సంబంధించిన అప్‌ డేట్‌ వచ్చింది. ఓటింగ్‌ రిజల్ట్ ప్రకారం ఈ వారం ఇంట్రెస్టింట్‌ కంటెస్టెంట్‌ హౌజ్‌ని వీడబోతున్నారట. ఎప్పటిలాగానే రోహిత్‌ ఓటింగ్‌లో టాప్‌లో ఉన్నారు. ఆ తర్వాత అమర్‌, రామ్‌ ప్రసాద్‌, వంశీ, వర్షిణి ఉన్నారు. చివర్లో షాలిని ఉందట. దీంతో ఈ వారం షాలిని ఎలిమినేట్‌ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన షూటింగ్‌ జరుగుతుంది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

33
షాలినిని ఎలిమినేట్‌ చేయాలని కోరుకున్న నెటిజన్లు

షాలిని మొదట్నుంచి వీక్‌గానే ఉంది. కాకపోతే కంటెంట్‌ ఇవ్వడంలో ముందుంటుంది. నామినేషన్‌లో, ఇతర డిస్కషన్‌ సమయంలో ఆమె బాగా యాక్టివ్‌గా ఉంటుంది. కల్పించుకొని మాట్లాడుతుంది. ఇది కొంత వరకు ఓకే, కానీ కావాలని ప్రతి విషయంలో ఇన్‌ వాల్వ్ అయి డామినేట్‌ చేసే ప్రయత్నం చేస్తుందనే విమర్శలు వచ్చాయి. అదే సమయంలో ఆమె రోహిత్‌తో క్లోజ్‌గా ఉంటుంది. ఓ సందర్భంలో ఆయనతో మరీ ఓవర్‌గా స్పందించిందట. ఇది ఇబ్బందికరంగా ఉంది. అందుకే షాలినిని ఎలిమినేట్‌ చేయాలనే డిమాండ్‌ వినిపించింది. ఈ క్రమంలో ఈ వారం ఆమెనే ఎలిమినేట్‌ కావడం విశేషం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories