ఇప్పటికే ఏడు విజయవంతమైన సీజన్లు పూర్తి చేసుకున్న తమిళ బిగ్ బాస్ త్వరలో ఎనిమిదో సీజన్‌ను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. బిగ్ బాస్ తమిళ్ ను మొదటి నుంచి లోకనాయడకుడు కమల్ హాసన్ హోస్టింగ్ చేస్తూ వస్తున్నారు.
కాని ఆయన కొన్ని కారణాల వల్ల ఈ షో నుంచి తప్పుకోవడంతో ఈ ఎనిమిదో సీజన్‌ను ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి హోస్ట్ చేయనున్నారు. ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో ఎనిమిదో సీజన్ అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది.
ఎప్పటిలాగే ఈ సీజన్‌లో చాలా మంది వివాదాస్పద కంటెస్టెంట్లు పాల్గొంటారని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా, టీటీఎఫ్ వాసన్, అతని స్నేహితురాలు మరియు నటి షాలిన్ జోయా, హోస్ట్ మకా పా ఆనంద్, రోబో శంకర్ తదితరులు ఈ సీజన్‌లో పాల్గొంటున్నట్లు సమాచారం.