ఏ రాజకీయ పార్టీ దగ్గర చేయి చాచలేదు, ఆ ఆస్తులు అమ్మకుంటే ఇండస్ట్రీలో నేనే రిచ్.. శివాజీ హాట్ కామెంట్స్

First Published Jan 19, 2024, 5:23 PM IST

శివాజీ తన ఆస్తుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో శివాజీ మాట్లాడుతూ తనకి ఆస్తుల కంటే క్యారెక్టర్ ముఖ్యమని అన్నారు. తానూ నటుడిగా రాణిస్తున్న రోజుల్లోనే వ్యాపారాలు ఉండేవని శివాజీ అన్నారు.

తెలుగు బిగ్ బాస్ చరిత్రలో సీజన్ 7 సంచలనంగా నిలిచింది. ఊహించని విధంగా సామాన్య రైతు బిడ్డ విజేతగా నిలవడం.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో అరెస్ట్ కావడం లాంటి సంఘటనలు సీజన్ 7 లోనే జరిగాయి. విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్, నటుడు శివాజీ, బుల్లితెర నటుడు అమర్ దీప్, శోభా శెట్టి లాంటి వారు ఈ సీజన్ లో హైలైట్ అయ్యారు. 

Sivaji

బిగ్ బాస్ ముగిసిన తర్వాత హీరో శివాజీకి ఊహించని పబ్లిసిటీ లభించింది. పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవడం వెనుక కారణం శివాజీనే అంటూ కూడా ప్రశంసలు దక్కాయి. శివాజీ ఇప్పటికి వరుసగా ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. తాను నటించిన 90's మిడిల్ క్లాస్ బయోపిక్ అనే వెబ్ సిరీస్ ని కూడా రిలీజ్ చేశారు. 

Latest Videos


తాజాగా ఇంటర్వ్యూలో శివాజీ తన ఆస్తుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో శివాజీ మాట్లాడుతూ తనకి ఆస్తుల కంటే క్యారెక్టర్ ముఖ్యమని అన్నారు. తానూ నటుడిగా రాణిస్తున్న రోజుల్లోనే వ్యాపారాలు ఉండేవని శివాజీ అన్నారు. సినిమాల్లో రాణిస్తూనే వ్యాపారాలు చేశా. ఆ రోజుల్లో నేను చేసిన ఇన్వెస్టిమెంట్స్ ఈ రోజు నాచేతుల్లో ఉంది ఉంటే ఇండస్ట్రీలో నన్ను మించిన ధనవంతుడు ఉండేవాడు కాదు. 

Sivaji

చాలా ప్రధాన నగరాల్లో ఎకరాల కొద్దీ భూములు ఉండేవి. అత్యంత విలువైన 14 ఎకరాలని సినిమా కోసం అమ్మేశా. ఆ ఆస్తులన్నీ ఉండిఉంటే తిరుగులేని ధనవంతుడిగా ఉండేవాడిని అని శివాజీ అన్నారు. నా ఊర్లో పొలం శాశ్వతంగా ఉంటే చాలు అనుకునే మెంటాలిటీ నాది.  కాబట్టి మిగిలిన చోట్ల ఆస్తులు ఉంచుకోలేదు. 

పదేళ్ల పాటు నాకు సినిమాలు లేకున్నా కానీ బతికానంటే అందుకు కారణం భూములపై చేసిన ఇన్వెస్టిమెంట్, రియల్ ఎస్టేట్ అని శివాజీ అన్నారు. సినిమా నన్ను బతికించింది. నా స్నేహితులు కూడా సినిమాలు చేస్తూ వ్యాపారాలు చేసి ఎదిగారని శివాజీ అన్నారు. నన్ను కాపాడింది సినిమా, వ్యాపారాలు మాత్రమే. ఏ రాజకీయ పార్టీ దగ్గర అయినా నేను చేయి చాచినట్లు నిరూపిస్తే ఈ క్షణం చనిపోతా అంటూ శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

బిగ్ బాస్ హౌస్ లో ఏదో ఒకటి నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో వెళ్ళాను. అలాగే శివాజీ సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు అనే స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా వెళ్ళాను. కానీ ఈ రెండింటికీ మించి అక్కడ నా ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చేసింది అని శివాజీ అన్నారు. 

click me!