చచ్చిపోవాలనిపించింది... అరెస్ట్ పై ఫస్ట్ టైం రియాక్ట్ అయిన పల్లవి ప్రశాంత్, అంత స్ట్రగుల్ అయ్యాడా!

Published : Feb 15, 2024, 01:14 PM IST

పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ గెలిచి సెన్సేషన్ సృష్టించాడు. కప్ కొట్టిన రెండు రోజుల్లో అరెస్ట్ కావడం అంతకు మించిన సంచలనం అయ్యింది. తన అరెస్ట్ పై పల్లవి ప్రశాంత్ మొదటిసారి స్పందించాడు.   

PREV
16
చచ్చిపోవాలనిపించింది... అరెస్ట్ పై ఫస్ట్ టైం రియాక్ట్ అయిన పల్లవి ప్రశాంత్, అంత స్ట్రగుల్ అయ్యాడా!
BB Utsavam

బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. ఒక కామనర్ టైటిల్ కొట్టడం ఇదే తొలిసారి. ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ తన ఆట తీరుతో అశేష అభిమానులను సొంతం చేసుకున్నాడు. వారాలు గడిచే కొద్దీ పల్లవి ప్రశాంత్ గేమ్ మెరుగవుతూ వచ్చింది. 
 

26
BB Utsavam

టైటిల్ ఫేవరేట్స్ శివాజీ, అమర్ దీప్ లకు ఝలక్ ఇస్తూ పల్లవి ప్రశాంత్ విన్నర్ గా అవతరించాడు. అమర్ దీప్ రన్నర్ కాగా, శివాజీ మూడో స్థానంలో నిలిచాడు. ఫినాలే ముగిశాక అన్నపూర్ణ స్టూడియో ఎదుట అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి. 

 

36
BB Utsavam

పల్లవి ప్రశాంత్, అమర్ అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. గొడవ పడ్డారు. పబ్లిక్, ప్రైవేట్ ప్రాపర్టీ నాశనం చేశారు. అమర్ దీప్ కారుపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి చేశారు. అద్దాలు పగలగొట్టారు. గీతూ రాయల్, అశ్వినిశ్రీ కార్ల అద్దాలు కూడా పగిలాయి. 

46
BB Utsavam


స్టూడియో బయట ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పోలీసులు పల్లవి ప్రశాంత్ ని వెనుక గేటు నుండి బయటకు పంపారు. నేరుగా ఇంటికి వెళ్లిపోవాలని సూచించారు. పోలీసుల సూచనలు పెడచెవిన పెట్టి ర్యాలీ చేసిన పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేశాడు. రెండు రోజులు జైల్లో ఉన్న ప్రశాంత్ బెయిల్ పై బయటకు వచ్చాడు. 

56
BB Utsavam

అరెస్ట్ తర్వాత మొదటిసారి ఆ సంఘటనపై పల్లవి ప్రశాంత్ స్పందించాడు. బీబీ ఉత్సవం పేరుతో స్టార్ మా స్పెషల్ ఈవెంట్ ఏర్పాటు చేసింది. బిగ్ బాస్ 7 కంటెస్టెంట్స్ అందరూ ఈ షోలో పాల్గొన్నారు. తన తండ్రిని తలచుకుని పల్లవి ప్రశాంత్ కన్నీరు పెట్టుకున్నాడు. 

 

66
BB Utsavam

కప్ కొట్టి మా నాన్న కళ్ళలో సంతోషం చూడాలి అనుకున్నాను. కానీ ఆయన కోర్టు బయట పడుకుని ఉన్న వీడియో చూసి గుండె బద్దలైంది. నేను ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నానను అనిపించింది... అని కన్నీటి పర్యంతం అయ్యాడు. బీబీ ఉత్సవం ప్రోమో విడుదల కాగా.. ఈ ఆసక్తికర విషయాలతో కూడుకుని ఉంది.. 

click me!

Recommended Stories