బిగ్ బాస్ సీజన్ 5:  కంటెస్టెంట్స్ గా 19మంది టాప్ సెలెబ్రిటీస్ ఎంట్రీ... వాళ్ళు ఎవరు, బ్యాక్ గ్రౌండ్ ఏందంటే..!

Published : Sep 06, 2021, 10:05 AM IST

బిగ్ బాస్ కర్టైన్ రైజింగ్ ఎపిసోడ్ గ్రాండ్ గా ముగిసింది. కిన్ నాగార్జున తనదైన హోస్టింగ్ స్కిల్స్ తో షోని ఆసక్తికరంగా మార్చారు. అలాగే గతానికి భిన్నంగా మొదటి రోజే 19 మంది కంటెస్టెంట్స్ ని హౌస్లోకి పంపారు. మరి ఆ కంటెస్టెంట్స్ ఎవరు, వాళ్ళ డిటైల్స్ ఏమిటంటే...   

PREV
119
బిగ్ బాస్ సీజన్ 5:  కంటెస్టెంట్స్ గా 19మంది టాప్ సెలెబ్రిటీస్ ఎంట్రీ... వాళ్ళు ఎవరు, బ్యాక్ గ్రౌండ్ ఏందంటే..!

బిగ్ బాస్ సీజన్ 5 ఫస్ట్ కంటెస్టెంట్ వేదికపైకి వచ్చేసింది యూట్యూబర్ సిరి హన్మంత్.  ఆ లక్కీ ఛాన్స్ దక్కించుకుంది. క్రాక్ మూవీలోని ఐటెం సాంగ్ 'చీమకుర్తిలో కన్ను తెరిచా.. చినగంజాంలో నా వళ్ళు విరిచా..' సాంగ్ తో సిరి హన్మంత్ ఎంట్రీ ఇచ్చారు. టాప్ టు బాటమ్ గోల్డెన్ కలర్ లో ఉన్న ట్రెండీ వేర్ ధరించిన సిరి హన్మంత్ ఆసక్తికర స్టెప్స్ తో అలరించింది. ఇక కింగ్ నాగార్జున ఆమెకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఆమె డాన్స్ అదిరిపోయిందంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇక యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ల ద్వారా సిరి హన్మంత్ పాప్యులర్ కావడం జరిగింది. 
 

219

యూట్యూబ్ వేదికగా పాపులారిటీ తెచ్చుకొని, వెండితెరపై కూడా నటిస్తున్న విజే సన్నీ సెకండ్ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్లోకి ప్రవేశించారు. 
 

319


నటి లహరి బిగ్ బాస్ హౌస్లోకి ప్రవేశించిన మూడవ కంటెస్టెంట్. వేదికపై నాగ్ ఎప్పటికి వాడని రోజా ఇచ్చి ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేశారు. అర్జున్ రెడ్డి మూవీలో లహరి నర్స్ రోల్ చేయడం జరిగింది.

419

స్టార్ సింగర్, 2010 ఇండియన్ ఐడల్ విన్నర్ శ్రీరామ్ చంద్ర బిగ్ బాస్ సీజన్ 5 నాలుగవ కంటెస్టెంట్. వేదికపై శ్రీరామ్ చంద్ర తన సింగింగ్ టాలెంట్ చూపించారు. 


 

519

కొరియోగ్రాఫర్ అన్ని మాస్టర్ హౌస్లోకి ప్రవేశించిన ఐదవ కంటెస్టెంట్. చాలా జోవియల్ అయిన నేను, చక్కగా ఎంటర్టైన్ చేస్తానని నాగార్జునకు ప్రామిస్ చేశారు. 

619

టెలివిజన్ సెలబ్రిటీ, నటుడు లోబో ఆరవ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ వేదికపైకి వచ్చారు. అవమానాలు ఎదురైనా కానీ, తనకు ఇలాగే ఉండడం ఇష్టమన్న లోబో, హౌస్ లో అల్లాడిస్తానని చెప్పారు. 


 

719

సీరియల్స్, సినిమాలలో కీలక రోల్స్ చేస్తున్న నటి ప్రియ హౌస్లోకి ఎంటరైన ఏడవ కంటెస్టెంట్. ఒకవేళ ఒంటరి జీవితం గడపాల్సి వస్తే నా వల్ల అవుతుండగా... అని తెలుసుకోవడానికి బిగ్ బాస్ హౌస్ ఒక వేదిక అని ప్రియ తెలిపారు. 

819

మేల్ మోడల్, రాంప్ వాక్ ట్రైనర్ జెస్సి హౌస్లోకి వచ్చిన 8వ కంటెస్టెంట్. నిజానికి జెస్సి అంతగా ప్రేక్షకులకు పరిచయం లేని పేరు అని చెప్పాలి.

919

జబర్దస్త్ ఫేమ్ ప్రియాంక సింగ్ 9వ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చారు. నేను ట్రాన్స్ జెండర్ అని ఓపెన్ గా చెప్పిన ప్రియాంక, వేదిక సాక్షిగా, తండ్రికి తలవంపులు తెచ్చే పనులు చేయనని ప్రామిస్ చేశారు. 

1019

ఇక యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ సీజన్ 5లో హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన 10వ కంటెస్టెంట్. గతంలో చిక్కుకున్న కొన్ని వివాదాలు బాధపెడుతున్నాయని, తానేమిటో నిరూపించుకుంటానని షణ్ముఖ్ తెలిపారు. 
 

1119

నటి హమిద.. షణ్ముఖ్ తరువాత 11వ కంటెస్టెంట్ గా హౌస్లోకి వెళ్లారు. హమీదా గురించి కూడా ప్రేక్షకులకు తెలిసింది తక్కువే. 
 

1219

కాగా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన 12వ కంటెస్టెంట్ నటరాజ్ మాస్టర్. హీరో అవుదామని వచ్చి, డాన్సర్ గా మారిన నటరాజ్, తన ప్రెగ్నెంట్ వైఫ్ ని వదిలి వెళుతున్నందుకు చాలా ఎమోషనల్ అయ్యారు. 

1319

యూట్యూబ్ బోల్డ్ అండ్ హాట్ బేబీ సరయు బిగ్ బాస్ హౌస్లోకి 13వ కంటెస్టెంట్ గా ఎంటర్ అయ్యారు. నాగార్జున చెప్పిన డైలాగ్స్ సరయు తన మార్కు బూతు జోడించి పలికారు. హౌస్లో కూడా తనతో మాములుగా ఉండదని,ఒకింత బయపెట్టేశారు. 

  
 

1419

14వ కంటెస్టెంట్ గా నటుడు విశ్వ హౌస్లోకి ఎంటర్ అయ్యారు. ఇక తన ఇంట్రో వీడియోలో విశ్వ తన జీవితం ఆవిష్కరించారు. జీవితంలో తాను ఎన్ని బాధలు పడ్డారో తెలియజేశారు. ఆర్థిక బాధలు, బ్రదర్ మరణం వంటి సంఘటనలు తనను మానసిక వేదనకు గురిచేశాయని, అయితే వాటన్నిటికీ ఎదిరించి నిలిచినట్లు తెలిపారు. 
 

1519

15వ కంటెస్టెంట్ గా సీరియల్ నటి ఉమాదేవి హౌస్లోకి ప్రవేశించారు. అనేక ఫ్యామిలీ ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆమె తెలిపారు. ఇక సీరియల్స్ లో గయ్యాళిగా కనిపించిన ఉమాదేవి నిజంగా ఏమిటో చూపిస్తానని ఉమాదేవి తెలిపారు. 
 

1619

16వ కంటెస్టెంట్ గా నటుడు మానస్ ఎంట్రీ ఇచ్చారు. మానస్ కాస్ట్యూమ్, డాన్స్ ని నాగ్ అప్రిసియేట్ చేశారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా, హీరోగా, విలన్ గా చేశావ్, అలాగే నీవు మమ్మీ బాయ్ అని తెలిసింది. హౌస్లో ఉండగలవా అని అడిగారు. ఛాలెంజెస్ అంటే ఇష్టం అన్న మానస్, హౌస్ లో ఉంటానని నాగ్ కి హామీ ఇచ్చారు.

1719


ఆర్జే కాజల్ 17వ కంటెస్టెంట్ గా వేదికపైకి ఎంట్రీ ఇచ్చారు. కాజల్ కి మైక్ ఇవ్వడానికి నాగార్జున భయపడ్డారు. కాజల్ ఆర్జే కావడంతో ఆమెకు మైక్ ఇస్తే మాట్లాడుతూనే ఉంటుంది, అన్న అర్థంలో సెటైర్ వేశారు. కాజల్ తనకు నాగార్జున ఐ లవ్ యు చెప్పాలని కోరుకోగా, నాగ్ ఆ కోరిక నెరవేర్చాడు. హౌస్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తానని కాజల్, నాగార్జునతో చెప్పి హౌస్లోకి ఎంటర్ కావడం జరిగింది. 
 

1819

18వ కంటెస్టెంట్‌గా స్వేత వర్మ వచ్చారు. సోషల్‌ మీడియాలో, నటిగా పాపులర్‌ అయిన ఈ భామ నాగార్జున ముందు రచ్చ చేసింది. ఎంట్రీతోనే అదిరిపోయే సాంగ్‌తో హౌజ్‌లోకి అడుగుపెట్టింది స్వేత వర్మ. ఆ తర్వాత నాగార్జున ముందు కూడా అదే హుషారు చూపించింది. తాను ఏదైనా స్ట్రెయిట్‌ అని, తగ్గెదేలే అని, ఎవరైనా ఎక్‌ట్రాలు చేస్తు ఇచ్చిపడేస్తా అని తెలిపింది.
 

1919


19వ కంటెస్టెంట్‌గా పాపులర్‌ యాంకర్‌ రవి ఎంట్రీ ఇచ్చాడు. అదిరిపోయే డాన్స్ తో దుమ్ములేపిన రవిని నాగార్జున ఆట పట్టించాడు. నీకు పెళ్లైన విషయం నాకు చెప్పలేదని ఆటపట్టించాడు. దీనికి యాంకర్ రవి చెబుతూ మూడేళ్ల క్రితమే చెప్పానని తెలిపాడు. ఈ సందర్భంగా తన కూతురు ఇచ్చిన గిఫ్ట్ కి, ఆమె చివరి మాటలకు ఎమోషనల్‌ అయ్యాడు రవి. ఇది అందరిని ఆకట్టుకుంటుంది. 

click me!

Recommended Stories