హీరోయిన్ గా స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు ఎంట్రీ... హీరో కార్తీకి జంటగా క్రేజీ ప్రాజెక్ట్ తో ఆరంగేట్రం!

First Published Sep 6, 2021, 8:32 AM IST

సౌత్ లో పరిశ్రమకు చెందిన హీరోలు, డైరెక్టర్స్, నిర్మాతల కూతుర్లు హీరోయిన్స్ గా మాదిరిన సందర్భాలు చాలా అరుదు. శృతి హాసన్, నిహారిక కొణిదెల ఇలా చెప్పుకోవడానికి చాలా తక్కువ పేర్లు ఉన్నాయి. 

అయితే ఈ మధ్య ఈ ట్రెండ్ నెమ్మదిగా సౌత్ లో ఊపందుకుంటుంది. పరిశ్రమకు చెందిన ప్రముఖుల కూతుర్లు కూడా హీరోయిన్స్ గా మారుతున్నారు. తాజాగా స్టార్ డైరెక్టర్ శంకర్ చిన్న కూతురు అదితి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నారు. 

కార్తీ హీరోగా తెరకెక్కుతున్న విరుమాన్ మూవీతో ఆమె వెండితెర రంగ ప్రవేశం చేస్తున్నారు. విలేజ్ బ్యాక్ గ్రౌండ్ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు మత్తయ్య రూపొందిస్తున్నారు. లంగా ఓణిలో అదితి శంకర్ లుక్ ఆకట్టుకుంటుంది.

ఈ క్రేజీ ప్రాజెక్ట్ నిర్మాతలుగా హీరో సూర్య, ఆయన సతీమణి జ్యోతిక వ్యవహరిండం మరో విశేషం. ఈ స్టార్ కపుల్ శంకర్ కూతురిని తమ నిర్మాణ సంస్థ ద్వారా హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు. 


ఇక విరుమాన్ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు మత్తయ్యతో యువన్ శంకర్ రాజా మొదటిసారి పని చేస్తున్నట్లు సమాచారం. షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీపై కోలీవుడ్ లో పాజిటివ్ బజ్ నడుస్తుంది. 

 పెద్ద కూతురు ఐశ్వర్య వివాహం ఇటీవలే శంకర్ నిర్వహించారు. ఐశ్వర్య డాక్టర్ కాగా, క్రికెటర్ రోహిత్ దామోదర్ తో ఆమె వివాహం జరిగింది. ఈ వేడుకకు కోలీవుడ్ కి చెందిన ప్రముఖులు అందరూ హాజరయ్యారు. 
 


మరోవైపు చరణ్ తో మూవీ ప్రకటించిన శంకర్, భారతీయుడు 2 మూవీ పూర్తి చేయాల్సి ఉంది. భారతీయుడు 2 వివాదంలో ఉండగా, విడుదల ఆలస్యం అవుతుంది. అలాగే బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ తో శంకర్ అపరిచితుడు రీమేక్ ప్రకటించారు. 

click me!