అంతర్జాతీయ స్థాయిలో సూపర్ హిట్ అయిన టీవీ రియాలిటీ షో బిగ్ బాస్. ఇండియాలో దాదాపు అన్ని రీజినల్ భాషల్లో సక్సెస్ అయిన ఈ షో తెలుగులో నాలుగో సీజన్‌కు రెడీ అవుతోంది. నాగ్ హోస్ట్ చేస్తున్న ఈ సీజన్‌కు సంబంధించి ప్రోమో కూడా వచ్చేసింది. ఈ నేపథ్యంలో షోలో పాల్గొన బోయే కంటెస్టెంట్‌ల విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్‌లు వీరే అంటూ కొంత మంది పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.