ఇప్పటి వరకు ఎంతగానో అలరించిన బిగ్ బాస్ సీజన్ 7లో ఇక మిగిలింది ఒక్క వారమే. ఫైనలిస్టులు కూడా ఖరారయ్యారు. అర్జున్ రెడ్డి, అమర్ దీప్, ప్రియాంక, యావర్, ప్రశాంత్, శివాజీ ఫైనలిస్టులుగా నిలిచారు. అత్యంత ఉత్కంఠ మధ్య శోభా శెట్టి ఎలిమినేట్ అయింది. బిగ్ బాస్ సీజన్ 7లో గ్లామర్ అట్రాక్షన్ గా నిలిచిన శోభా శెట్టి ఫైనలిస్ట్ గా అర్హత సాధించడంలో అడుగు దూరంలో నిలిచిపోయింది.