బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్ గా పాల్గొన్న బోల్డ్ బ్యూటీ కిరణ్ రాథోడ్ తొలి వారంలోనే ఎలిమినేట్ అయింది. బిగ్ బాస్ ద్వారా ఆమెకి పెద్దగా ఒరిగింది ఏమీలేదు. అయితే ఫేడ్ అవుట్ అయిన కిరణ్ రాథోడ్ కి బిగ్ బాస్ ద్వారా కాస్త గుర్తింపు లభించింది. 2001లో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన కిరణ్ రాథోడ్.. నువ్వు లేక నేను లేను, జెమిని, భాగ్యలక్ష్మి బంపర్ డ్రా లాంటి చిత్రాల్లో నటించింది. ఇంకా అనేక చిన్న చిత్రాల్లో నటించి మెప్పించింది.