Pragya Jaiswal Dress Cost : రకుల్ పెళ్లి.. డ్రెస్ కోసం ప్రాగ్యా జైశ్వాల్ ఎన్ని లక్షలు ఖర్చు పెట్టిందో తెలుసా?

Published : Feb 24, 2024, 02:08 PM IST

బాలయ్య హీరోయిన్ ప్రాగ్యా జైశ్వాల్ (Pragya Jaiswal) తాజాగా రాయల్ లుక్ లో మెరిసింది. ఈ సందర్భంగా తను ధరించిన డ్రెస్ ధర నెట్టింట హాట్ టాపిక్ గ్గా మారింది. రకుల్ పెళ్లి కోసం ఆమె ప్రత్యేకంగా తీసుకున్నట్టు తెలిపింది.

PREV
16
Pragya Jaiswal Dress Cost : రకుల్ పెళ్లి.. డ్రెస్ కోసం ప్రాగ్యా జైశ్వాల్ ఎన్ని లక్షలు ఖర్చు పెట్టిందో తెలుసా?

క్రేజీ హీరోయిన్ ప్రాగ్యా జైశ్వాల్ చివరిగా బాలయ్యతో కలిసి నటించిన ‘అఖండ‘తో మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసినా పెద్దగా ఆడలేదు. అప్పటి నుంచి నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పైన అప్డేట్స్ కూడా లేవు. 

26

సినిమాల పరంగా ఈ ముద్దుగుమ్మ జోరు చూపించకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ప్రాగ్యా జైశ్వాల్ చాలా యాక్టివ్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. అదిరిపోయే అవుట్ ఫిట్లలో బ్యూటీఫుల్ లుక్స్ తో ఈ ముద్దుగుమ్మ ఆకట్టుకుంటోంది. 

36

ఈ క్రమంలో తాజాగా కొన్ని ఆకర్షణీయమైన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే  ప్రాగ్యా ధరించిన డ్రెస్ కాస్ట్ హాట్ టాపిక్ గ్గా మారింది. 

46

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) పెళ్లి కోసం ఆ డ్రెస్ తీసుకున్నట్టు కూడా ప్రాగ్యా తెలిపింది. ఎంతో ఆకర్షణీయంగా ఉన్న లెహంగా సెట్ ధర ఎంతనేదానిపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. 

56

దీంతో ఆ డ్రెస్ విలువల రూ.3.50 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉంటుందని అంటున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి (Rakul Preet Singh Wedding) కోసం ప్రాగ్యా ఇంతలా ఖర్చు చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

66

కాస్తా ధర ఎక్కువైనప్పటికీ సో బ్యూటీఫుల్.. సో ఎలెగెంట్ అంటున్నారు నెటిజన్లు.. ముత్యాలతో తయారు చేసిన ఆ లెహంగా సెట్ లో ప్రాగ్యా కూడా వజ్రంలా మెరిసిపోతోంది. ఇక ఆమె ఇచ్చిన ఫోజులూ కట్టిపడేస్తున్నాయి. 

click me!

Recommended Stories