Bigg Boss Kaushal: కాక్రోచ్ జనతా పార్టీకి ఇచ్చిపడేసిన బిగ్ బాస్ కౌశల్, ఇప్పుడేం చేస్తారో చూద్దాం

Published : Jul 29, 2026, 07:13 PM IST

బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ మంద కాక్రోచ్ జనతా పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్ళు నిజంగా విద్యార్థుల కోసం పోరాడుతున్నారా లేదా అనేది ఇప్పుడు తేలిపోతుంది అంటూ వీడియో పోస్ట్ చేశారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

PREV
15
కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు

ఢిల్లీలో చేపట్టిన నిరసనలతో కాక్రోచ్ జనతాపార్టీ సంచలనం సృష్టించింది. నీట్ పేపర్ లీక్ వివాదంపై కొన్ని వారాల పాటు కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా చేపట్టింది. ఈ నిరసనల ప్రభావంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కూడా చేశారు. తమ ప్రయత్నం విజయవంతం కావడంతో కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు విరమించింది.

25
ఆందోళనల్లో నేరగాళ్లు

కానీ దీనిపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. కాక్రోచ్ జనతా పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వారు కూడా ఉన్నారు. కుట్ర పూరితంగా ఫండింగ్ తో ఏర్పడిన పార్టీ అది అంటూ విమర్శలు చేస్తున్నారు. ఆ పార్టీ చేపట్టిన నిరసనల్లో విద్యార్థుల కంటే ఎక్కువగా నేరగాళ్లు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనల్లో 2873 మందికి క్రైమ్ రికార్డులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. సీజేపీ నిజస్వరూపం బయటపడుతోంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

35
కాక్రోచ్ జనతా పార్టీకి ఇచ్చిపడేసిన కౌశల్

ఇదిలా ఉండగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 విన్నర్ కౌశల్ మంద కూడా సీజీపీపై సెటైర్లు వేస్తూ వీడియో పోస్ట్ చేశారు. పంజాబ్ లో కూడా పేపర్ లీక్ అయిన విషయాన్ని కౌశల్ ఈ వీడియోలో ప్రస్తావించారు. కౌశల్ మాట్లాడుతూ..' ఇప్పుడే తెలిసిన వార్త ఏంటంటే పంజాబ్ లో కూడా పేపర్ లీక్ అయింది. పంజాబ్ లో ఉన్నది ఆమ్ ఆద్మీ ప్రభుత్వం కదా.. వాళ్ళేం చేస్తారో చూడాలి. ఇప్పుడు ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని మన సోకాల్డ్ కాక్రోచ్ జనతా పార్టీ వ్యతిరేకిస్తుందా, సపోర్ట్ చేస్తుందా అనేది ఎదురు చూడాలి.

45
వీళ్ళ ధర్నాలు బీజేపీపైన మాత్రమేనా

కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు నిజంగా జనాల కోసం, యువత కోసం కష్టపడుతుంటే.. పంజాబ్ లో కూడా ధర్నాలు, ఆందోళనలు చేయాలి కదా. వీళ్ళు బీజేపీ ప్రభుత్వంపైన మాత్రమే ధర్నాలు చేస్తారా ? లేక విద్యార్థుల కోసం ఎక్కడికైనా వెళ్లి ధర్నాలు చేస్తారా అనేది చూద్దాం' అంటూ కౌశల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

55
యువత నిజాలు తెలుసుకోవాలి

మరో వీడియోలో కౌశల్ మాట్లాడుతూ ధర్మేంద్ర ప్రధాన్ లాంటి అద్భుతమైన విద్యాశాఖామంత్రి మనం తిరిగి పొందలేం. ఇప్పటికైనా విద్యార్థులు మేల్కొని నిజాలు గ్రహించాలి. మనలో ఉన్న బలహీనతలే పేపర్ లీక్ లాంటి చర్యలకు కారణం అవుతున్నాయి. మార్పు మనలోనే మొదలు కావాలి అని కౌశల్ తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories