BigBoss Telugu OTT Arrangements : గ్రాండ్ లుక్ లో ‘బిగ్ బాస్ ఓటీటీ’ హౌస్.. స్ట్రీమింగ్ కు ఏర్పాట్లు పూర్తి..

Published : Feb 19, 2022, 06:42 PM ISTUpdated : Feb 19, 2022, 10:41 PM IST

బిగ్‌బాస్‌ తెలుగు రియాలిటీ షో ఆరో సీజన్‌ ఓటీటీ స్ట్రీమింగ్ కు సర్వం సిద్ధం చేశారు. ఈ సారి హౌజ్ లుక్ చాలా గ్రాండ్ గా కనిపించనుంది. గతంతో పోల్చుకుంటే మరిన్ని సౌకర్యాలతో హౌజ్ ముస్తాబైంది.  ఇప్పటికే ఫైనల్ లిస్ట్  జాబితా నెట్టింట చక్కర్లు కొడుతుండగా ఈ నెల 26 నుంచి షో స్ట్రీమింగ్ షురూ కానుంది.  

PREV
16
BigBoss Telugu OTT Arrangements : గ్రాండ్ లుక్ లో ‘బిగ్ బాస్ ఓటీటీ’ హౌస్.. స్ట్రీమింగ్ కు  ఏర్పాట్లు పూర్తి..

బిగ్‌బాస్‌ రియాలిటీ షో ప్రపంచ వ్యాప్తంగా విజయవంతమైన షో. ఇండియాలోనూ విశేష ఆదరణ పొందుతుంది. ఇక తెలుగులో ఇప్పటి వరకు ఐదో షోలు విజయవంతంగా పూర్తయ్యాయి. గతేడాది డిసెంబర్‌లో ఐదో సీజన్‌ పూర్తికాగా, వీజే సన్నీ విన్నర్‌గా నిలిచారు. 
 

26

ఇక ఆరో సీజన్‌ కూడా త్వరగానే ప్రారంభమవుతుందని హోస్ట్ నాగార్జున (Nagarjuna) గ్రాండ్‌ ఫినాలే రోజునే చెప్పారు. చెప్పినట్టుగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ఇక  బిగ్ బాస్  ఫైనల్ లిస్ట్ జాబితా కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ జాబితాలో అరియానా గ్లోరీ, ఆషురెడ్డి, ముమైత్‌ ఖాన్, హమీద, సరయు వంటి హాట్‌ భామలు ఎక్కువగా కనిపిస్తున్నారు. 
 

36

మరొవైపు కొందరు కంటెస్టెంట్ల ఫేసులు కూడా రివీల్‌ అయిపోయాయి. బిగ్‌బాస్‌ స్టేజ్‌పై కంటెస్టెంట్ల ఇంట్రో పర్‌ఫామెన్సుల వీడియో క్లిప్పింగులు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.  ‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ పేరుతో ‘డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌’లో  ఈ నెల 26నుంచి ఈ షో స్ట్రీమింగ్‌ కానుంది. 

46

యథావిథంగా ఈసారి కూడా హోస్ట్‌గా కింగ్‌ నాగార్జుననే వ్యవహరించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్‌ అయిన సంగతి తెలిసిందే. నో కామా, నో పులిస్టాప్.. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్‌ అంటూ ప్రోమోను వదిలిన మేకర్స్‌ అందుకు తగ్గట్లుగానే షోను ప్లాన్‌ చేస్తున్నారు. మరి ఈసారి ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్న బిగ్‌బాస్‌ షో ఎలా ఉండబోతుందో చూడాలి. మరోవైపు ప్రేక్షకులు కూడా ఈ షో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  
 

56

గత షోలతో పోల్చితే ఈ షో ఓటీటీలో విడుదల కాబోతుండటం విశేషం. గతేడాది హిందీ బిగ్ బాస్ ఓటీటీలోనే రిలీజైంది. ఇక్కడ కూడా అదే తరహాలో టెలికాస్ట్ చేయనున్నారు. `బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌` పేరుతో డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో ఈ రియాలిటీ 24 గంటలు ప్రసారం కానుండటం విశేషం.

66

మరోవైపు గత ఐదు సీజన్ల నుంచి ఇద్దరిని చొప్పున ఈ ఆరో సీజన్‌కి ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. దీంతో పది మంది కంటెస్టెంట్లు పాతవారే ఉండబోతున్నారు. అరియానా, ముమైత్‌ ఖాన్‌, ఆషురెడ్డి, అఖిల్‌, హమీద, సరయు, ధన్‌రాజ్‌, తనీష్‌, మహేష్‌విట్టా, ఆదర్శ్‌, నటరాజ్‌ మాస్టర్‌ గత సీజన్లలో పాల్గొన్న వారే కావడం విశేషం.  

click me!

Recommended Stories