నన్నూ క్యాస్టింగ్‌ కౌచ్‌ వదల్లేదు.. ఒప్పుకోకపోతే అలా బెదిరించారు.. తెలుగు హీరోయిన్‌ ఎస్తెర్‌ షాకింగ్ కామెంట్స్

Published : Feb 19, 2022, 04:26 PM ISTUpdated : Feb 19, 2022, 11:21 PM IST

బిగ్‌బాస్‌ తెలుగు 4 ఫేమ్‌ నోయల్‌ మాజీ భార్య, నటి ఎస్తెర్‌ షాకింగ్‌ కామెంట్‌ చేశారు. తాను క్యాస్టింగ్‌ కౌచ్‌ని ఎదుర్కొన్నట్టు వెల్లడించి సంచలనానికి తెరలేపారు. తాను అనేక రకాలుగా బెదిరింపులకు ఎదుర్కొన్నట్టు చెప్పింది ఎస్తెర్‌. 

PREV
16
నన్నూ క్యాస్టింగ్‌ కౌచ్‌ వదల్లేదు.. ఒప్పుకోకపోతే అలా బెదిరించారు.. తెలుగు హీరోయిన్‌ ఎస్తెర్‌ షాకింగ్ కామెంట్స్

సునీల్‌(Sunil) హీరోగా నటించిన `భీమవరం బుల్లోడు` చిత్రంలో హీరోయిన్‌గా నటించి ఆకట్టుకుంది నటి ఎస్తెర్‌(Esther Noronha). ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత `గరంలో` స్పెషల్‌ సాంగ్‌లో మెరిసింది. అంతేకాదు `జయ జానకి నాయక` చిత్రంలో ఓ పాత్రలో మెరిసింది. ఆ తర్వాత టాలీవుడ్‌కి దూరమైన ఈ భామ ఆ మధ్య ఓ టీవీ షోలో కనిపించింది. అలాగే యూట్యూబ్‌లో ఇంటర్వ్యూ ఇస్తూ తాను ఉన్నాననే విషయాన్ని గుర్తు చేస్తుంది Esther. 
 

26

అయితే కేవలం ఒక్క సినిమాతోనే రాణించి సినిమా ఆఫర్లు లేక ఖాళీ అయిపోయిన ఎస్తెర్‌ తాజాగా చిత్ర పరిశ్రమ గురించి, సినిమాలో జరిగే సంఘటనల గురించి ఓపెన్‌ అయ్యింది. తనకు ఎదురైన అనుభవాలను వెల్లడించింది. తాను కూడా క్యాస్టింగ్‌ కౌచ్‌ని ఎదుర్కొన్నట్టు బోల్డ్ కామెంట్స్ చేసింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె ఇంకా అనేక విషయాలను తెలిపింది. తన అనుభవాలను పంచుకుంది. 

36

ఇందులో ఎస్తెర్‌ చెబుతూ, సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఆఫర్స్ రావాలంటే కమిట్‌మెంట్‌ అడిగారని తెలిపింది. ఆ కమిట్‌మెంట్‌కి ఒప్పుకోకపోతే కెరీర్‌ ఇక్కడితోనే ఆగిపోతుందని తనని బెదిరించినట్టు వెల్లడించింది. క్యాస్టింగ్‌ కౌచ్‌ని తాను కూడా ఫేస్‌ చేసినట్టు చెప్పింది ఎస్తెర్‌. అయితే వాళ్లు ముందుగా పరోక్షంగా కమిట్‌మెంట్ గురించి అర్థమయ్యేలా చెబుతారని, `నీకంటే వెనకొచ్చిన వాళ్లు ముందుకు వెళ్లిపోతారు. నువ్వు మాట వినకపోతే ఇక్కడే ఆగిపోతావ్‌. చాలా మంది హీరోయిన్లకి ఇలానే అయ్యింది` అని తనతో అన్నారని పేర్కొంది ఎస్తెర్‌. 

46

ఎస్తెర్‌ ఇంకా చెబుతూ, సినిమా అంటే తనకిష్టమని, కానీ అదే లైఫ్‌ కాదని  చెప్పింది. దానికోసం దిగజారాల్సిన అవసరం లేదని పేర్కొంది. అందుకే తాను కమింట్‌మెంట్‌కి నో చెప్పిందట. సినిమా అవకాశాలు రావాలంటే అదొక్కటే దారి అనుకుంటే ఆ సినిమాలు తనకు అవసరం లేదని బోల్డ్ గా చెప్పేసింది. 
 

56

అయితే ఈ క్యాస్టింగ్‌ కౌచ్‌ విషయంలో ఒక్కరిది తప్పు అని చెప్పలేమని, వాళ్లు అడగకపోయినా ఆఫర్‌ చేసే వాళ్లున్నారని, ఆఫర్‌ చేసే వాళ్లు లేకపోయినా అడిగే వాళ్లున్నారని చెప్పింది. నాకు ఏం కావాలో అది చెబుతానని, ఈ విషయంలో ఎవరినీ బ్లేమ్‌ చేయాలనుకోవడం లేదని చెప్పిన ఎస్తెర్‌.. తెలుగులో అవకాశాలు లేకపోయినా కన్నడ ఇండస్ట్రీ నుంచి తనకు మంచి ఆఫర్స్ వచ్చాయని పేర్కొంది. 

66

ఇదిలా ఉంటే హీరోయిన్‌గా ఒకటి రెండు సినిమాల్లో అలరించిన ఎస్తెర్‌ బిగ్‌బాస్‌ తెలుగు 4 ఫేమ్‌ నోయల్‌ ప్రేమలో పడింది. వీరిద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. కానీ ఇద్దరి మధ్య నెలకొన్న విభేదాల కారణంగా కేవలం ఆరునెలల్లోనే విడాకులు తీసుకున్నారు. నోయల్‌ ఓ వైపు సినిమాలు, యూట్యూబ్‌ వీడియోలు, ర్యాప్‌ సాంగ్స్, ఓటీటీ మూవీస్‌ చేస్తూ బిజీగా ఉన్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories