Published : Feb 19, 2022, 05:51 PM ISTUpdated : Feb 19, 2022, 06:08 PM IST
పాయల్ రాజ్ పుత్ ( Payal Rajput) ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళ, కన్నడలో సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. తాజాగా తమిళంలో నటించిన ‘గోల్ మాల్’ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఫొటోషూట్లతో సినిమా ప్రమోషన్ చేసుకుటోంది.
టాలీవుడ్ బ్యూటీల్లో ఆర్ ఎక్స్ (RX 100) హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఒకరు. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనస్సును గెలిచింది. తన గ్లామర్ తో కుర్రాళ్లను కట్టిపడేసింది.
26
ఆ తర్వాత ఎన్టీఆర్ : కథానాయకుడు, సీతా, ఆర్డీఎక్స్ లవ్, వెంకీ మామా, డిస్కో రాజా వంటి మూవీల్లో నటించి తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, కన్నడలో వరుస సనిమాలు చేస్తూ బిజీగా ఉంది.
36
తాజాగా, ‘గోల్ మాల్’ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రంలో నటించింది పాయల్. ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా జీవా, మిర్చి శివ, పాయల్ రాజ్‌పుత్ మరియు తాన్య నటించారు. రజనీకాంత్ రచయిత కాగా, ప్రియమణి( Priyamani) తమిళ-కన్నడ చిత్రం చారులత దర్శకుడు పొన్ కుమారన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
46
కాగా, ఈ మూవీ షూటింగ్ నిన్ననే పూర్తి అయ్యింది. ఈ మేరకు రాజ్ పుత్ పాయక్ షూట్ వ్రాప్డ్ ఫొటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. షూటింగ్ ముగిసిన సందర్భంగా టీమ్ కూడా ఫొటోలకు పోజులిచ్చింది.
56
ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ కామెడీ చిత్రంగా తెరకెక్కింది. యోగి బాబుతో సహా చాలా మంది ప్రముఖ హాస్యనటులు ఈ చిత్రానికి పనిచేశారని తెలుస్తోంది. జీవా, శివ జీవనోపాధి కోసం మోసం చేసే కుర్రాళ్లు. అలాంటి వారి జీవితంలో ఏమి జరుగుతుందనేది సినిమా కథాంశంగా ఉండనుంది.
66
అయితే ఈ చిత్రం షుటింగ్ ముగిసిన సందర్భంగా చిత్ర యూనిట్ కు సంబంధించిన ‘సుమ’ అనే మహిళలకు ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు తను ఆనందంగా ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ ‘చాలా కృతజ్ఞత’లు అంటూ క్యాప్షన్ పెట్టింది. ఈ ఫొటోల్లో పొట్టి నెక్కరులో తన థైస్ చూపిస్తూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోందీ పాయల్..