ఇంటి నిర్మాణానికి కావలసిన సిమెంట్, ఇటుకలు ఇలా సామాగ్రి మొత్తాన్ని సొంత ఖర్చులతో హిమజ సమకూర్చుకుంది. తన ఇంటి విశేషాలని కూడా హిమజ అభిమానులతో పంచుకుంది. మొత్తం నాలుగు అంతస్తుల్లో ఇంటి నిర్మాణం జరుగుతుంది. గ్రౌండ్ ఫ్లోర్ ని తన తల్లి దండ్రుల కోసం కేటాయిస్తుందట. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం తనదే అని హిమజ చెబుతోంది. ఆ పైన అంతస్థులో మేకప్, జిమ్ వర్కౌట్ లు ఉంటాయి. ఆ పైన అంతస్తుల్లో అత్యాధునిక హంగులతో థియేటర్ నిర్మాణం ఉంటుందని హిమజ అంటోంది.