లెహంగా వోణీలో కట్టిపడేస్తున్న ‘బిగ్ బాస్’ హారిక.. ట్రెడిషనల్ వేర్ లోనూ మతిపోగొట్టేలా పోజులు!

First Published | Jan 14, 2023, 12:50 PM IST

‘బిగ్ బాస్’ హారిక పండగ వేళ ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది. సంప్రదాయ దుస్తుల్లో అదిరిపోయే పోజులిస్తూ ఫొటోషూట్ చేసింది. ఆ ఫొటోలను తన ఫాలోవర్స్ తో సోషల్ మీడియాలో పంచుకుంది.
 

యూట్యూబర్ గా సెన్సేషన్  క్రియేట్ చేసిన దేత్తడి హారిక (Dethadi Harika) యూత్ లో మంచి ఫాలోయింగ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రేజ్ తోనే పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు’లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. 
 

బిగ్ బాస్ సీజన్ 4తో హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చి  టీవీ ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. అప్పటికే యూట్యూబ్ లో దుమ్ములేపుతున్న ఈ తెలంగాణ మాస్ బ్యూటీ ‘బిగ్ బాస్’తోనూ అలరించింది. తన దైన శైలిలో ఆడియెనస్ ను అలరించింది. 


ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు నిత్యం నెట్టింట యాక్టివ్ గానే కనిపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తూ కుర్రకారును తనవైపు తిప్పుకుంటోంది. మరోవైపు గ్లామర్ విందులోనూ అదరగొడుతోంది.

కొద్దిరోజులుగా గ్లామర్ షోతో స్టన్నింగ్ గా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది హరిక. ఆ ఫొటోలను నెట్టింట వదులుతూ దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ట్రెడిషనల్ అండ్ ట్రెండీ వేర్స్ లోనూ ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ ఫెస్టివల్ ట్రీట్ అందించింది. తన ఫాలోవర్స్ కు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ పలు ఫొటోలను పంచుకుంది.

బోగీ - సంక్రాంతి పండుగ సందర్భంగా హారిక ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది. ఆరెంజ్ కలర్ లెహంగా వోణీలో కట్టిపడేసింది. సంప్రదాయ దుస్తుల్లో యంగ్ బ్యూటీ అందం మరింత రెట్టింపు అయ్యింది. దీంతో హారిక లేటెస్ట్ లుక్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

మరోవైపు నడుము అందాలతో, కవ్వించే పోజులతోనూ  కుర్ర  గుండెల్ని పేల్చేసిందీ భామ. ఎలాంటి అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చినా గ్లామర్ విందు మాత్రం మరవడం లేదు. దీంతో నెటిజన్లు కూడా బ్యూటీ అందాన్ని పొగుడుతున్నారు. లైక్స్, కామెంట్లతో ఫొటోలను వైరల్ చేస్తున్నారు. 

Latest Videos

click me!