ఎప్పుడో కొన్నేళ్ళ కిందట శివాజీ హీరోగా వచ్చిన ఓ సినిమాలో హీరోయిన్ గా నటించింది హనీరోజ్. కాని టాలీవుడ్ లో మాలీవుడ్ బ్యూటీకి పెద్దగా ఆదరణ దక్కలేదు. అవకాశాలు రాకపోవడంతో..మలయాళ పరిశ్రమకే పరిమితం అయ్యింది. ఆతరువాత ఆమెలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. 40 ఏళ్లు దాటినా.. నాటు అందాలతో.. కుర్రాళ్ళ చేత కేకలు వేయించే హనీరోజ్.. చాలా కాలం తరువాత బాలయ్య సినిమా ద్వారా మరోసారి టాలీవుడ్ లో అడుగు పెట్టింది.