ముక్కు అవినాష్ ఇంటిలో పెళ్లి సందడి.. హల్దీ వేడుక ఫోటోలు షేర్ చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్!

First Published | Oct 19, 2021, 1:09 PM IST


జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆయన ఇంటిలో పెళ్లి సందడి నెలకొంది. అవినాష్ హల్దీ వేడుక ఘనంగా జరుపుకోగా, సదరు ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఆగష్టు 31న Mukku Avinash తన పెళ్లి ప్రకటన చేశారు. అనూజ అనే అమ్మాయితో పెళ్లి నిశ్చితార్థం జరిగినట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. తన ఎంగేజ్మెంట్ ఫోటోలు అవినాష్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు.   చడీ చప్పుడు లేకుండా నిశ్చితార్థం జరుపుకొని, నాకు పెళ్లి అంటూ అందరినీ సర్ప్రైజ్ చేశారు అవినాష్.
 

 
''Anuja అవినాష్ కి ఎంగేజ్మెంట్ జరిగింది. కరెక్ట్ పర్సన్ మన జీవితంలోకి ప్రవేశించినప్పుడు ఆలస్యం చేయకూడదు, మా కుటుంబాలు కలిశాయి, మేము కలిశాము. చాలా నిరాడంబరంగా నిశ్చితార్థం జరిగిపోయింది.  మీరు ఎప్పుడూ అడుగుతూ ఉండేవారు.. 'పెళ్లి ఎప్పుడూ?' అని, అతి త్వరలో నా అనూజాతో.. ఎప్పటికీ మీ ఆశీర్వాదాలు ఉంటాయని, మీ అవినాష్.. సారీ, అనూజా అవినాష్''.. అంటూ ఇంస్టాగ్రామ్ లో కామెంట్ పెట్టారు. 



తనకు కాబోయే భార్య పేరు అనూజాగా తెలియజేసిన అవినాష్, ఆమె పూర్తి వివరాలు వెల్లడించలేదు. తాజాగా హల్దీ వేడుక ఫోటోలు షేర్ చేసిన అవినాష్ తన పెళ్ళికి ముహూర్తం కుదిరినట్లు స్పష్టత ఇచ్చారు. అవినాష్ వెడ్డింగ్ కార్డు మాత్రం ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయలేదు. దీనితో అవినాష్ పెళ్లి ఎప్పుడు అనే విషయం ఖచ్చితంగా తెలియడం లేదు. 
 


ఇక అవినాష్ haldi వేడుక ఫోటోలు చాలా కలర్ ఫుల్ గా ఉన్నాయి. పసుపు రంగు బట్టలు ధరించిన కుటుంబ సభ్యులు, వేడుకలో సందడి చేస్తున్నారు. అవినాష్ తమ్మడు అజయ్ ని కూడా అవినాష్ హల్దీ వేడుకలో చూడవచ్చు. 
 

Jabardasth నుండి గత ఏడాది బయటికి వచ్చేశారు అవినాష్. బిగ్ బాస్ ఆఫర్ రావడంతో అవినాష్ రూ. 10లక్షలు జబర్దస్త్ నిర్మాతలకు చెల్లించి Bigg boss season4లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వడం జరిగింది.  స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్నారు. 

ముఖ్యంగా అవినాష్ కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేది. కేవలం ఫైనల్ కి రెండు వారాల ముందు అవినాష్ ఎలిమినేట్ అయ్యారు. జబర్దస్త్ లో చోటు కోల్పోయినా.. స్టార్ మా అవినాష్ కి మరో బంపర్ ఛాన్స్ ఇచ్చింది. ఆ ఛానల్ లో కొత్తగా అవినాష్ తో కామెడీ స్టార్స్ పేరుతో ఓ షో ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం ఆ షోలో కంటెస్టెంట్ గా అవినాష్ కొనసాగుతున్నారు. 
 

గతంలో అవినాష్ పెళ్లిపై కొన్ని రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో Ariyanaతో అవినాష్ కి స్నేహం ఏర్పడగా, వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారనే టాక్ కూడా వినిపించింది. 

అయితే ఈ వార్తలను అవినాష్ ఖండించారు. అలాగే తనకు సంబంధాలు చూస్తున్నట్లు, త్వరలో పెళ్లి చేసుకుంటానని వెల్లడించారు. అనూజతో నిశితార్థం జరుపుకుని, రూమర్స్ కి చెక్ పెట్టాడు. 

Also read Raashi khanna ప్రైవేట్ ఫోటోలు లీక్ చేసి షాక్ ఇచ్చిన హాట్ హీరోయిన్ రాశి ఖన్నా... రచ్చ చేశామంటూ బోల్డ్ కామెంట్

Also read Bigg boss telugu 5: నామినేషన్స్ లో ఆ ఏడుగురు... రవి, శ్రీరామ్, ప్రియలతో పాటు టాప్ కంటెస్టెంట్స్

Latest Videos

click me!