ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న Kota srinivasarao అనసూయ గురించి మాట్లాడుతూ... అనసూయ మంచి నటి. చూడడానికి చాల అందంగా ఉంటుంది. ఆమె ఎలాంటి బట్టలు ధరించినా ప్రేక్షకులు చూస్తారు. కానీ అనసూయ పొట్టిపొట్టి బట్టలు ధరిస్తూ ఉంటారు. అలాంటి బట్టలు ధరించాల్సిన అవసరం ఆమెకు లేదు. అనసూయ డ్రెస్సింగ్ స్టైల్ నాకు నచ్చదని కోట అన్నారు.
కోట చేసిన ఈ వ్యాఖ్యలకు స్పందిస్తూ అనసూయ ట్విట్టర్ లో వరుస ట్వీట్స్ చేశారు. ఆమె ఓ సుదీర్ఘ సందేశం పంచుకోవడం జరిగింది. ఆ లేఖలో మొత్తం సమాజాన్ని, పరిశ్రమను కూడా అనసూయ ప్రశ్నించారు. ఆడవాళ్ళ డ్రెస్ పై కామెంట్స్ చేసేవాళ్ళు ఇలాంటి వారిపై ఎందుకు మాట్లాడరు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
అనసూయ తన ట్వీట్స్ లో... ఇటీవల ఓ సీనియర్ నటుడు నాపై కొన్ని కామెంట్స్ చేశారు. నా Dressing style గురించి తప్పుగా మాట్లాడారు. ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి అంత దారుణంగా మాట్లాడటం నన్ను ఎంతో బాధించింది. ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది వారి వ్యక్తిగతం, వృత్తిపరమైన పరిస్థితులను బట్టి కూడా అలా ధరించాల్సి రావచ్చు. ఏదేమైనా ఒకరు ధరించే దుస్తులు వారి వ్యక్తిగతం, అన్నారు.
కానీ నేడు సోషల్ మీడియా ఇలాంటివాటినే హైలెట్ చేస్తోంది. ఆ సీనియర్ నటుడు మందు తాగుతూ, అధ్వాన్నమైన దుస్తులను ధరించినప్పుడు, సినిమాల్లో మహిళలను కించపరిచినప్పుడు ఎందుకీ సోషల్ మీడియా పట్టించుకోదనేది ఆశ్చర్యంగా అనిపిస్తుంది.ఎవరైతే పెళ్లి చేసుకున్నారో, పిల్లలను కలిగి ఉన్నారో, సినిమాల్లో హీరోయిన్స్ తో రొమాన్స్‌తో చేస్తున్నారో, చొక్కాలిప్పేసి బాడీ చూపిస్తున్నారో.. అలాంటి స్టార్స్ ని ఎవరూ ప్రశ్నించరు?, అని అనసూయ ఆవేదన చెందారు.
నేను పెళ్లైన స్త్రీని, ఇద్దరు పిల్లల తల్లిని. పితృస్వామ్య విధానాలను ప్రశ్నిస్తూ పని చేస్తున్న నేను`నా వృత్తిలో విజయం సాధించేందుకు కష్టపడుతున్నా.. ప్రజలకు మీ అభిప్రాయాలను చెప్పేముందు మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి అని, ఆవేశంతో కూడిన లేఖ పోస్ట్ చేసింది అనసూయ.
ఇంకా అనసూయ తన ట్వీట్స్ లో.., పెద్దరికం చిన్నరికం అనేవి వయసుతో కాదండి, అనుభవంతో కండక్ట్ చేసుకునే విధానంలో ఉంటుంది. ఒక నటుడిగా ఆయనంటే నాకు చాలా గౌరవం. విభిన్నమైన పాత్రలు చాలా అద్భుతంగా అభినయించారు. కానీ ఒక వ్యక్తిగా ఆయన కామెంట్స్ చాలా నీచంగా ఉన్నాయి, అవి అనవసరం కూడా, అని కుండ బద్ధలు కొట్టేసింది అనసూయ.