ఒంటరిగా బెడ్ పై పడుకొని 'ఏం చెప్పాలి నా పరిస్థితి' అంటున్న మోనాల్... ఆమె సమస్య అదేనా?

First Published May 26, 2021, 2:31 PM IST

బిగ్ బాస్ షోతో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది మోనాల్. హీరోయిన్ గా తెలుగులో ఒకటి రెండు చిత్రాలు చేసినా ఆమెకు కనీస గుర్తింపు రాలేదు. అల్లరి నరేశ్ హిట్ మూవీ సుడిగాడు మూవీలో మోనాల్ హీరోయిన్ గా చేశారు. అల్లరి నరేష్ తోనే మరో చిత్రం చేయడం జరిగింది ఆమె.

చెప్పుకోదగ్గ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న మోనాల్ కి బిగ్ బాస్ రూపంలో అదృష్టం తగిలింది. హౌస్ లోకి వెళ్ళడం ద్వారా ఫేమ్ తో పాటు మంచి రెమ్యూనరేషన్ రాబట్టుకుంది. హౌస్ లో అత్యధిక రెమ్యూనరేషన్ మోనాల్ దే అని సమాచారం.
undefined
బిగ్ బాస్ సీజన్ 4 చివరి ఎపిసోడ్ కి ముందు వారం మోనాల్ ఎలిమినేట్ అయ్యారు. అంటే 14వారాలు హౌస్ లో ఉండడం ద్వారా ఆమెకు మంచి పారితోషికం లభించింది. అలాగే హౌస్ నుండి బయటికి వచ్చిన వెంటనే అల్లుడు అదుర్స్ మూవీలో స్పెషల్ సాంగ్ లో నటించే అవకాశం రాబట్టుకుంది.
undefined
బిగ్ బాస్ షోలో పాల్గొనడం ద్వారా వచ్చిన ఫేమ్ ని స్టార్ మా ఉపయోగించుకోవడం కోసం ఆమెకు డాన్స్ ప్లస్ షోలో జడ్జిగా ఛాన్స్ ఇచ్చారు. ఇటీవలే షో ముగియగా మోనాల్ బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.
undefined
ఇక మోనాల్-అఖిల్ ప్రేమ కథ గురించి తెలిసిందే. హౌస్ లో మొదలైన వీరి ప్రేమ కథ కొనసాగుతుంది. మేము స్నేహితులం అని చెప్పుకుంటూ హైదరాబాద్ వీధుల్లో చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు.
undefined
అఖిల్ మోనాల్ కలిసి ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు. తనతో పాటు అఖిల్ కెరీర్ కూడా గాడిన పెట్టాలని మోనాల్ ట్రై చేస్తున్నారు . అందుకే తన ఫేమ్ అతని కెరీర్ కి మంచి చేసేలా నిర్ణయాలు తీసుకుంటూ, కలిసి నటిస్తున్నారు.
undefined
తాజాగా మోనాల్ కి ఏమి కష్టం వచ్చిందో తెలియదు కానీ... ఇంస్టాగ్రామ్ లో ఓ క్రేజీ కామెంట్ చేసింది. బెడ్ పై పడుకొని ఉన్న మోనాల్ 'గుడ్ మార్నింగ్.. ఇది నైట్ ఫోటో షూట్ కాదు, ఏమి చెప్పాలి నా పరిస్థితి అంటూ కామెంట్ పెట్టింది.
undefined
మోనాల్ అంతలా ఫీల్ కావడానికి ఆమెకు వచ్చిన కష్టం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. మోనాల్ కామెంట్ ఆమె డై హార్డ్ ఫ్యాన్స్ ని మాత్రం ఆవేదనకు గురిచేస్తుంది. అలాగే మోనాల్ కి వచ్చిన బాధ ఏమిటో తెలుసుకోవాలనే ఉత్సాహం వారిలో కనిపిస్తుంది.
undefined
ఒకవేళ అఖిల్ తోడు లేక మోనాల్ ఒంటరిగా ఫీల్ అవుతుందేమో.  అస్పష్టంగా ఉన్న మోనాల్ కామెంట్ వెనుక కారణం ఏమిటో తెలియాలంటే ఓపిక పట్టాల్సిందే. డాన్స్ ప్లస్ షో కూడా ముగియగా మోనాల్ ని బుల్లితెర ప్రేక్షకులు మిస్ కానున్నారు.
undefined
click me!