బిగ్ బాస్ లో ఒక సీజన్ తర్వాత మళ్లీ ఛాన్స్ రాదుకదా? ఎందుకు టైటిల్ ను వదులుకోవాలని నిర్ణయించుకున్నారనే ప్రశ్నకు.... ‘కావాలంటే ‘బిగ్ బాస్’లోకి నెక్ట్స్ సీజన్ లో వచ్చేవాడిని.. రవితేజతో సినిమానే ముఖ్యం. మళ్లీ ‘బిగ్ బాస్’లో అవకాశం ఇవ్వకపోయిన పర్లేదు. ఈ విషయంలో ఎప్పుడూ నా డిసీషన్ మారదు.’ అంటూ బదులిచ్చారు. ఇక రవితేజ సినిమాలో అమర్ కు ఎలాంటి రోల్ వస్తుందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.