హెలికాప్టర్ లో షికారు చేస్తున్న గంగవ్వ... కాలినడక నుండి గాలిమోటారు రేంజ్ కి ఎదిగిన అవ్వ!

First Published Mar 14, 2021, 12:16 PM IST

కృషితో నాస్తి దుర్భిక్షం అనేది పెద్దల మాట. నమ్మిన దాని కోసం మనసుపెట్టి పనిచేస్తే... సాధ్యం కానిది ఏది ఉండదు. ఒకప్పుడు పొలాలు, పశులు తప్ప మరొకటి తెలియని గంగవ్వ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సెలబ్రిటీ.

తనకు తెలిసిన విషయాలను, తన పల్లె జీవనాన్ని యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులు తెలిజేస్తూ వారి అభిమానం చూరగొంది ఆమె. మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ లో గంగవ్వ వీడియోలు సూపర్ పాప్యులర్ అయ్యాయి.  ఆ విధంగా ఆమె యూట్యూబ్ సెలెబ్రిటీ అయ్యారు.
undefined
ఆ ఇమేజ్ తో గంగవ్వ బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొనే ఛాన్స్ దక్కించుకున్నారు. అరవై ఏళ్ల వయసులో గంగవ్వ షోలో అడుగుపెట్టడమే సంచలనం.
undefined
షోలో తన మార్క్ గేమ్, మాటల పంచ్ లు, అమాయకత్వంతో ఆకట్టుకున్నారు గంగవ్వ. బిగ్ బాస్ ప్రేక్షకులు గంగవ్వకు భారీగా మద్దతు తెలిపారు. అయితే అనారోగ్య కారణాల చేత గంగవ్వ హౌస్ నుండి మధ్యలో బయటికి వచ్చారు.
undefined
బిగ్ బాస్ తరువాత ఆమె ఇమేజ్ మరింతగా పెరిగిపోయింది. బుల్లితెరపై కూడా ఆమె కనిపించడం జరిగింది. షోలో పాల్గొనడం ద్వారా వచ్చిన డబ్బులతో తన ఊరిలో ఇల్లు కట్టుకుంటుంది గంగవ్వ. దాదాపు రూ. 20లక్షలతో గృహ నిర్మాణం చేపట్టింది.
undefined
తాజాగా గంగవ్వ హెలికాప్టర్ ఎక్కారు. హెలికాప్టర్ ఎక్కి తన ఊరి పొలాలు, ఇళ్ళు, పరిసరాలు ఆకాశం నుండి చూశారు. హెలికాప్టర్ మొదటిసారి ఎక్కిన తన అనుభవాన్ని ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది .
undefined
ఇంస్టాగ్రామ్ లో గంగవ్వ హెలికాప్టర్ రైడ్ చూసిన ఆమె అభిమానులు నువ్వు గ్రేట్ అవ్వ అని అంటున్నారు. ఇలా గంగవ్వ ఇంకా ఎన్నో సాధించాలని కోరుకుంటున్నారు.
undefined
గంగవ్వ తన జీవితంలో ఇంత ప్రజాభిమానం సంపాదిస్తానని, హెలికాఫ్టర్ ఎక్కుతానని ఊహించి ఉండదు. నేలపై నడిచే గంగవ్వ ఆకాశానికి ఎగరడం చాలా మందికి స్ఫూర్తి కలిగించే విషయమే.
undefined
ఇక గంగవ్వ తన యూట్యూబ్ ఛానల్ కొనసాగిస్తున్నారు. గతానికి మించిన ఆదరణ ఆమె యూట్యూబ్ వీడియోలకు దక్కుతుంది. అందమైన సొంత ఇల్లు కట్టుకుంటునన్న  ఆనందంలో ఆమె ఉన్నారు.
undefined
click me!