ప్రేమ ముదిరి పాకానపడింది... డైమండ్ రింగ్ తో అవినాష్ కి అరియనా లవ్ ప్రపోజల్!

First Published Feb 24, 2021, 12:24 PM IST

అరియనా-అవినాష్ ల ప్రేమ ముదిరి పాకాన పడింది. తాజా సంఘటలో వీరు ఒకరిపై మరొకరు హద్దులు లేని ప్రేమ కురిపించుకున్నారు. అరియనా నేరుగా అవినాష్ కి లవ్ ప్రపోజ్ చేయడం అందరినీ షాక్ గురి చేసింది. 
 

బిగ్ బాస్ వేదిక సాక్షిగా వెల్లి విరిసింది అవినాష్, అరియానాల స్నేహం. సీజన్ చివరి వరకు ఉన్న ఈ ఇద్దరు కంటెస్టెంట్స్, తమది వేరే ప్రపంచంగా మెలిగారు.
undefined
వీరిద్దరూ ఒక టీమ్ గా, మిగతా వారు మరొక టీమ్ గా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు. ప్రతి విషయంలో అవినాష్ కి అరియనా.. అరియానాకు అవినాష్ సపోర్ట్ చేసేవారు.
undefined
స్నేహానికి మించిన బంధం వీరిదని అప్పట్లో పుకార్లు వచ్చాయి. హౌస్ నుండి బయటికి వచ్చాక కూడా అరియనా, అవినాష్ తమ స్నేహం కొనసాగిస్తున్నారు. అనేక కార్యక్రమాలలో కలిసి కనిపిస్తున్నారు.
undefined
తాజాగా స్టార్ మాలో ప్రసారమయ్యే స్టార్ట్ మ్యూజిక్ అనే షోకి వీరిద్దరూ రావడం జరిగింది. ఆ షోలో అవినాష్, అరియనా ప్రత్యేకంగా నిలిచారు. ఉప్పెన మూవీలోని సూపర్ హిట్ సాంగ్... 'నీకన్ను నీలి సముద్రం' సాంగ్ కి రొమాంటిక్ స్టెప్స్ తో రెచ్చిపోయారు.
undefined
అరియనాను ఎత్తుకు తిప్పిన అవినాష్... ఆమెపై అపరిమితమైన ప్రేమ కనబరిచాడు. అవినాష్ మూమెంట్స్ ని అరియానా ఎంజాయ్ చేయడం జరిగింది.
undefined
అనూహ్యంగా అరియనా తన మిత్రుడు అవినాష్ కి లవ్ ప్రపోజల్ చేసింది. అది కూడా అందమైన డైమండ్ రింగ్ తో. ఈ సీన్ వేదికపై చూసిన మిగతా సభ్యులు ఈలలతో రెచ్చిపోయారు.
undefined
స్టార్ మా స్టార్ట్ మ్యూజిక్ ప్రోగ్రాం ప్రోమో విడుదల చేయగా ఈ ఆసక్తికర విషయాలు పొందుపరచి ఉన్నాయి.
undefined
ప్రస్తుతం స్నేహితులుగా ఉన్న అవినాష్, అరియానా.. భవిష్యత్ లో ప్రేమికులుగా కూడా మారే అవకాశం లేకపోలేదన్న వాదన వినిపిస్తుంది.
undefined
తాజా ప్రోమోలో మాత్రం అవినాష్, అరియనా జంట చాలా అందంగా ఉంది. వారి లుక్స్, మూమెంట్స్ మరియు ఎక్స్ప్రెషన్స్ కట్టిపడేశాయి.
undefined
click me!