చేతిలో వైను కైపెక్కించే మేను... బిగ్ బాస్ అరియనా గ్లామరస్ లుక్ వైరల్ 

First Published | Feb 6, 2024, 1:29 PM IST


బిగ్ బాస్ బ్యూటీ అరియనా గ్లోరీ గ్లామరస్ షో హద్దులు దాటేస్తుంది. పాపులారిటీ పెంచుకునేందుకు స్కిన్ షోకి తెరలేపుతుంది. తాజాగా ట్రెండీ వేర్లో మెస్మరైజ్ చేసింది. 
 

Ariyana glory

ఒకప్పటి యూట్యూబ్ యాంకర్ అరియనా గ్లోరీ బిగ్ బాస్ షో వేదికగా ఫేమ్ రాబట్టింది. సీజన్ 4లో పాల్గొన్న అమ్మడు స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫైనల్ కి వెళ్ళింది. 
 

Ariyana glory

అరియనా ఒక దశలో టైటిల్ ఫేవరేట్ గా ప్రచారం అయ్యింది. ముక్కుసూటిగా గేమ్ ఆడిన అరియనా అభిమానులను సొంతం చేసుకుంది. అరియనా 4వ స్థానంలో సరిపెట్టుకుంది. అభిజీత్ సీజన్ 4 విన్నర్ అయ్యాడు. 


Ariyana glory

అరియనా ప్రస్తుతం బుల్లితెర మీద సందడి చేస్తుంది. అలాగే ఇంస్టాగ్రామ్ లో ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంది. కొన్నాళ్లుగా అరియనా గ్లోరీ గ్లామర్ డోస్ పెంచింది. బికినీలు, పొట్టిబట్టల్లో దర్శనమిస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. 

Ariyana glory

తాజాగా వైన్ గ్లాస్ పట్టుకుని దర్శనమిచ్చింది. జీన్స్, టాప్ ధరించి నడుము అందాలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. అరియనా గ్లామరస్ కుర్రకారును ఫిదా చేస్తుండగా కామెంట్స్ రూపంలో అభిమానం చాటుకుంటున్నారు. 

Ariyana glory

అరియనా కొంచెం ఒళ్ళు చేసింది. దీంతో ఆమెపై బాడీ షేమింగ్ కి పాల్పడ్డారు. విమర్శలపై స్పందించిన అరియనా... లావుగా ఉన్నా, బక్కగా ఉన్నా మీతో ఇబ్బందే. అయినా నేను ఎలా ఉంటే మీకెందుకు అని కౌంటర్లు విసిరింది. 

Latest Videos

click me!