అల్లు అర్జున్ వర్సెస్ విజయ్ దేవరకొండ, హిట్ లేకున్న తగ్గని రౌడీ హీరో క్రేజ్..

First Published | Feb 6, 2024, 12:36 PM IST

హిట్లు లేకపోయినా.. సౌత్ హీరోలకు పోటీ వస్తున్నాడు టాలీవుడ్  రౌడీ హీరో  విజయ్ దేవరకొండ. వరుస ప్లాప్ సినిమాలతో ఇబ్బందిపడుతున్నా.. ఏమాత్రం భయడటం లేదు విజయ్.. అంతే కాదు కాదు ఫాలోయింగ్ లో కూడా రికార్డ్ లకు రెడీ అవుతున్నాడు విజయ్. 

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సోషల్ మీడియా ఫాలోయింగ్ గట్టిగా ఉన్న హీరోలంటే.. అల్లు అర్జున్ తో పాటు.. సూపర్ స్టార్ మహేష్ పేరు బాగా వినిపిస్తుంది. వీరిద్దరు తమ పేజ్ ను బాగా అప్ డేట్ చేస్తుంటారు. అందుల్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు నెట్టింట  విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తెలుగులో అత్యధిక మంది ఫాలోవర్లు కలిగిన స్టార్ కూడా మన స్టైలిష్ స్టారే...

అయితే ఇప్పుడా క్రెడిట్ రిస్క్‌లో పడింది.  బన్నీని బీట్ చేస్తూ.. ఎప్పటికప్పుడు దగ్గరగా వస్తున్నాడు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి’ సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుని,.. పెళ్లి చూపులు, టాక్సీవాలా, గీతా గోవిందం సినిమాలతో అమ్మాయిలకు హాట్ ఫెవరెట్‌ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. కాని గీత గోవిందం తరువాత సాలిడ్ హిట్ లేదు రౌడీ హీరోకు. 
 


Vijay Devarakonda-Rashmika Mandanna

గీత గోవిందం తరువాత వచ్చిన  ‘నోటా’, ‘డియర్ కామ్రేడ్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ ఫలితాలను అందుకున్నా... యూట్యూబ్‌లో మాత్రం.. అది కూడా హిందీ డబ్బింగ్ వర్షన్‌లలో ఈసినిమాలకు కోట్లలో వ్యూస్ వచ్చాయి... ఇక ఆతరువాత పాన్ ఇండియా హీరో గా పూరీజగన్నాథ్‌తో చేస్తున్న ‘లైగర్’అతి పెద్ద డిజాస్టర్ గా నివడంతో విజయ్ కెరీర్ ఇబ్బందుల్లో పడింది. కాని ఫ్యాన్స్  ఫాలోయింగ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. 

ఈమధ్యే ఖుషి సినిమాతో కాస్త ఊరట లభించింది విజయ్ దేవరకొండకు. అంత క్రేజ్ ఉండబట్టే..  సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ జెడ్ స్పీడ్‌లో పెరిగిపోతూ వచ్చింది. అది అంతకంతకు పెరిగిపోతూనే ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా విజయ్ దేవరకొండక ఫాలోవర్లు  21 మిలియన్లు దాటారు. ఈ విషయంలో సౌత్ స్టార్ హీరోలను దాటుకుంటూ వచ్చాడు విజయ్. 

ప్రస్తుతం సోషల్ మీడియా ఫాలోవర్లలో అల్లుఅర్జున్‌ ముందున్నారు. ఆయన ప్రస్తుత ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు సంఖ్య 24.6 మిలియన్లు కాగా. విజయ్ దేవరకొండ ఫాలోయిగ్ తో పాటు.. బన్నీ ఫాలోయింగ్ కూడా జెట్ స్పీడ్ తో పెరిగిపోతుంది. దాంతో వీరిద్దరి ఫాలోవర్ల సంఖ్య విషయంలో హోరా హోరీ పోరు నడుస్తోంది. 

Vijay Devarakonda

ఇదే స్పీడ్‌తో ఇంకొన్ని రోజులు పోతే... ‘రౌడీ భాయ్’ విజయ్ దేవరకొండ, ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్‌ని దాటేయడం ఖాయం అటున్నారు ఫ్యాన్స్.. అయితే ఈ విషయాన్ని గమనించిన అల్లుఅర్జున్ ఆర్మీ ఇప్పటికే అలర్ట్ అయ్యిందట.అల్లుఅర్జున్‌ రికార్డు, విజయ్ దేవరకొండకి వెళ్లకూడదనే ఉద్దేశంతో కొత్త కొత్త అకౌంట్లు క్రియేట్ చేస్తూ... తమ అభిమాన హీరో ఫాలోవర్ల సంఖ్యను పెంచేందుకు తెగ తాపత్రయపడుతున్నారట ‘ఐకాన్ స్టార్ ఫ్యాన్స్. 
 

ఇక ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్ల సినిమా విషయానికివస్తే.. అల్లుఅర్జున్ పుష్ప2 తో ఫుల్ బిజీగా ఉన్నారు. పాన్ వరల్డ్ కు ఈసినిమా వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండ ఖషీతో మంచిహిట్ సొంతం చేసుకున్నాడు. రౌడీ హీరో కాస్తా ఫ్యామిలీ స్టార్ గామారిపోయాడు. ప్రస్తుత ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. 

Latest Videos

click me!