#GunturKaaram:‘గుంటూరు కారం’ OTT రిలీజ్ రోజే మరో మూడు పెద్ద సినిమాలు

First Published Feb 6, 2024, 12:37 PM IST

 ఓటీటీలో ఫిబ్రవరి 9న  సూపర్ హిట్ చిత్రాలు ప్రేక్షకులను అలరించటానికి రానున్నాయి. తెలుగు సినిమాలే కాకుండా ఇతర భాషల్లో భారీ విజయాలను అందుకున్న చిత్రాలను సైతం తెలుగులోకి డబ్ చేస్తున్నారు మేకర్స్. 


ఫిబ్రవరి 9 నుండి ‘గుంటూరు కారం’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని ఇప్పటికే వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా కన్ఫర్మ్ చేసింది నెట్‌ఫ్లిక్స్. ‘ఇక్కడ వాతావరణం వేడిగా మారబోతుంది ఎందుకంటే రౌడీ రమణ వచ్చేస్తున్నాడు. అతడు చాలా ఆవేశంలో ఉన్నాడు’ అంటూ క్యాప్షన్‌తో ఈ పోస్ట్‌ను షేర్ చేసింది. ఫిబ్రవరి 9 నుండి తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ‘గుంటూరు కారం’ స్ట్రీమింగ్ కానుందని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. దాంతో పాటు ఒక కొత్త పోస్టర్‌ను కూడా షేర్ చేసింది. అంతవరకూ బాగానే ఉంది. అయితే అదే రోజున మరో మూడు క్రీజీ చిత్రాలు కూడా ఓటిటిలోకి రాబోతున్నాయి.  ఆ చిత్రాలు ఏమిటంటే...


  సంక్రాంతి కానుక‌గా రిలీజైన శివ‌కార్తికేయ‌న్ త‌మిళ మూవీ అయ‌లాన్ బాక్సాఫీస్ వ‌ద్ద మోస్తారు వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. ధ‌నుష్ కెప్టెన్ మిల్ల‌ర్‌కు పోటీగా బ‌రిలో నిలిచిన‌ ఈ భారీ బ‌డ్జెట్ మూవీ ప‌న్నెండు రోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా దాదాపు 78 కోట్ల‌కుపైగా గ్రాస్ , న‌ల‌భై రెండు కోట్ల వ‌ర‌కు షేర్ క‌లెక్ష‌న్స్‌ రాబ‌ట్టింది. కెప్టెన్ మిల్ల‌ర్ త‌ర్వాత 2024లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన త‌మిళ మూవీగా అయ‌లాన్ నిలిచింది. ఏలియ‌న్ బ్యాక్‌డ్రాప్‌లో సైన్స్ ఫిక్ష‌న్ క‌థాంశంతో రూపొందిన అయ‌లాన్ సినిమాకు ఆర్ ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అయ‌లాన్ మూవీ డిజిట‌ల్ రైట్స్‌ను స‌న్ నెక్స్ట్ ఓటీటీ ద‌క్కించుకున్న‌ది. ఈ సైన్స్ ఫిక్ష‌న్ మూవీ ఫిబ్ర‌వ‌రి 9 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు తెలిసింది. త‌మిళంతో పాటు తెలుగులో కూడా అదే రోజు రిలీజ్ కానున్న‌ట్లు చెబుతున్నారు.
 

Latest Videos



తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్ర పోషించిన కెప్టెన్ మిల్లర్ మూవీ మంచి హిట్ అయింది. పొంగల్ సందర్భంగా తమిళంలో జనవరి 12న ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. అయితే, సంక్రాంతికి తీవ్రమైన పోటీ ఉండడంతో తెలుగులో ఆలస్యమైంది. తెలుగు రాష్ట్రాల్లో కెప్టెన్ మిల్లర్ మూవీ జనవరి 26వ తేదీన రిలీజైంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఇప్పుడు, ఈ చిత్రం థియేటర్లలోకి రిలీజై నెల ముగియక ముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది. కెప్టెన్ మిల్లర్ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఖరారైంది. కెప్టెన్ మిల్లర్ సినిమా ఫిబ్రవరి 9వ తేదీన అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆ ప్లాట్‍ఫామ్  అధికారికంగా ప్రకటించింది. కెప్టెన్ మిల్లర్ మూవీ తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళంలోనూ ఫిబ్రవరి 9న ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది.


 ‘కాటేరా’. కన్నడ స్టార్ హీరో దర్శన్ నటించిన లేటేస్ట్ సినిమా ఇదే. గతేడాది డిసెంబర్ 29న థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. ముందుగా దీనిని పాన్ ఇండియా లెవల్లో అన్ని భాషల్లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అటు సలార్ బరిలో ఉండడంతో కేవలం కన్నడలో మాత్రమే విడుదల చేశారు. ఈ సినిమా విడుదలై ఇన్ని రోజులు గడుస్తున్నా.. చాలా చోట్ల సినిమా హౌస్ ఫుల్ అవుతున్నాయి.. ఈ సినిమాకు అన్ని వర్గాల అడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వస్తుంది. ఈ క్రమంలోనే ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అయితే థియేటర్లలో మాత్రం కాదు.. కేవలం ఓటీటీలోనే ఈ సినిమా తెలుగులోకి అందుబాటులోకి రానుంది. లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా ఫిబ్రవరి 9 నుంచి ప్రముఖ ఓటీటీ మాధ్యమం జీ5లో తెలుగు, కన్నడ, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.

ఎక్స్‌ట్రా సీన్స్‌తో పాటు..


  ‘గుంటూరు కారం’  ఓటీటీలో  డ్యూరేషన్ పెరగనుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ‘గుంటూరు కారం’ థియేట్రికల్ వర్షన్‌లో అమ్మ పాటను డిలీట్ చేశారు. దాంతో పాటు బ్యాక్‌డ్రాప్‌కి సంబంధించి కొన్ని యాక్షన్‌ సీన్లు కూడా డిలీట్ అయ్యాయి. ఇప్పుడు ఇవన్నీ కలిపి ‘గుంటూరు కారం’ ఓటీటీ వర్షన్‌లో చూడవచ్చని సమాచారం. దీంతో సినిమా నిడివి కూడా పెరగనుంది. తాజాగా అమ్మ పాటను యూట్యూబ్‌లో విడుదల చేశారు మేకర్స్. కథ మొత్తానికి చాలా కీలకంగా నిలిచిన ఇలాంటి పాటను కట్ చేయడం ఏంటి అంటూ ప్రేక్షకులు విమర్శలు కురిపించారు. దీంతో ఈ పాటతో పాటు కొన్ని యాక్షన్ సీన్స్‌ను కూడా ఓటీటీ వర్షన్‌లో యాడ్ చేయాలని డిసైడ్ అయ్యారట మేకర్స్.

click me!