డబ్బులిచ్చి బిగ్ బాస్ హౌస్లోకి, అసలు ఏం జరిగిందో గుట్టు రట్టు చేసిన అలీ రెజా!

Published : Mar 07, 2024, 05:56 PM IST

బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాను డబ్బులిచ్చి హౌస్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడంటూ వచ్చిన ఆరోపణలపై స్పందించాడు. అప్పుడు ఏం జరిగిందో వెల్లడించాడు.   

PREV
15
డబ్బులిచ్చి బిగ్ బాస్ హౌస్లోకి, అసలు ఏం జరిగిందో గుట్టు రట్టు చేసిన అలీ రెజా!
Ali Reza

బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ అలీ రెజా తనపై వచ్చిన ఆరోపణలు ఖండించారు. తన ఎలిమినేషన్ అనంతరం ఏం జరిగిందో చెప్పాడు. హౌస్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న అలీ రెజా 7వ వారం ఎలిమినేట్ అయ్యాడు. అయితే అతడి ఎలిమినేషన్ ఎవరూ ఊహించలేదు. టైటిల్ ఫేవరేట్ ఎలిమినేట్ కావడం ఏమిటనే విమర్శలు వినిపించాయి. 
 

25

Ali Reza

అనూహ్యంగా అలీ రెజాకు తిరిగి హౌస్లో అడుగుపెట్టే ఛాన్స్ వచ్చింది. అతడు రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలో కొన్ని విమర్శలు వినిపించాయి. అలీ రెజా డబ్బులు ఎదురిచ్చి బిగ్ బాస్ హౌస్లోకి తిరిగి వెళ్ళాడనే పుకార్లు వినిపించాయి. అయితే బిగ్ బాస్ నిర్వాహకులు తనను తిరిగి వెళ్లాలని ఆదేశిస్తేనే హౌస్లో మరలా అడుగుపెట్టినట్లు చెప్పాడు. 

 

35

ఎలిమినేషన్ నన్ను చాలా బాధకు గురి చేసింది. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. ఆ బాధ నుంచి బయటపడాలని భార్యతో గోవా వెళ్ళాను. మీరు హౌస్లోకి వెళ్లాలని ఫోన్ చేశారు. నేను వెళ్ళను అని చెప్పాను. లేదు అగ్రిమెంట్ ప్రకారం మీరు వెళ్లాల్సిందే అన్నారు. 

45
Ali Reza

వారు చెప్పారనే నేను బిగ్ బాస్ షోకి మరలా వెళ్ళాను. నేను డబ్బులు ఇవ్వలేదు. అంత డబ్బు నా దగ్గర లేదు. బిగ్ బాస్ షోతో వచ్చిన డబ్బులతో ఇల్లు కట్టుకున్నాను. రీ ఎంట్రీ ఇచ్చాక ఎలా ఆడాలో అర్థం కాలేదు. బయటకు వెళ్లి వచ్చాక మరో విధంగా ఆడితే ఒక గేమ్ మార్చాడు అంటారు, గతంలో వలె ఉంటే... వీడు ఇంకా మారలేదు అంటారు. 

 

55
ali reza

టైటిల్ నాది కాదని అర్థం అయ్యింది. కనీసం టాప్ ఫైవ్ లో అయినా ఉంటే పరువు నిలుస్తుందని కోరుకున్నాను... అని అలీ రెజా అన్నారు. అలీ రెజాకు 4వ స్థానం దక్కింది. ఆ సీజన్ టైటిల్ విన్నర్ గా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ నిలిచాడు. శ్రీముఖి రన్నర్ గా ఉంది. 

click me!

Recommended Stories