Bigg Boss Harika: సొంతింటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ హారిక... సెలెబ్రిటీల సందడి!

First Published | Nov 30, 2023, 5:19 PM IST

బిగ్ బాస్ ఫేమ్ హారిక అలేఖ్య సొంతింటి కల నెరవేర్చుకుంది. నూతన గృహప్రవేశానికి బుల్లితెర సెలబ్స్ విచ్చేశారు. ఈ వేడుక ఫోటోలు హారిక ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి. 
 

Alekhya Harika

అలేఖ్య గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకకు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ ఆర్జే కాజల్, దీప్తి సునైన, శివ జ్యోతి హాజరయ్యారు. అలేఖ్యకు శుభాకాంక్షలు తెలియజేశారు. వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Alekhya Harika

దేత్తడి హారికగా యూట్యూబ్ వీడియోలతో హారిక పిచ్చ ఫేమస్. సోషల్ మీడియా సెలెబ హోదాలో ఆమెకు బిగ్ బాస్ సీజన్ 4లో ఛాన్స్ వచ్చింది. హౌస్లో హారిక టాస్క్ లో భాగంగా జుట్టు కత్తిరించుకుంది. స్ట్రాంగ్ ప్లేయర్ గా అవతరించిన హారిక ఫైనల్ కి వెళ్ళింది. 


హారికతో టైటిల్ విన్నర్ అభిజీత్ ఎఫైర్ నడిపారు. హౌస్లో అభిజీత్, హారిక మధ్య రొమాన్స్ చోటు చేసుకుంది. వీరిద్దరి కామన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్యాగ్స్ ట్రెండ్ చేశారు. వారు ఇష్టపడితే పెళ్లి చేస్తామని కుటుంబ సభ్యులు చెప్పడం విశేషం. షో ముగిశాక హారిక చెల్లితో సమానం అని చెప్పి అభిజీత్ షాక్ ఇచ్చాడు. 

హారిక 5వ స్థానంతో సరిపెట్టుంది. షో వలన ఆమెకు పాపులారిటీ దక్కింది. దాంతో క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. మొన్నటి వరకు సిరీస్లు చేసిన హారిక ఏకంగా సినిమాకు సైన్ చేసింది. 

బేబీ ఫేమ్ సాయి రాజేష్ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతుండగా హారిక హీరోయిన్. సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్నాడు. ఇటీవల పూజా కార్యక్రమాలతో సినిమా మొదలైంది. బేబీ మూవీతో యూట్యూబర్ వైష్ణవి చైతన్య ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. మరి హారికకు సాయి రాజేష్ ఎలాంటి విజయం ఇస్తాడో చూడాలి. 
 

Latest Videos

click me!