విజయ్ దేవరకొండ-రష్మిక మందాన మధ్య సంథింగ్ సంథింగ్ అనే రూమర్ ఇప్పటిది కాదు. డియర్ కామ్రేడ్ మూవీ విడుదల తర్వాత ఈ పుకార్లు లేచాయి. గత ఏడాది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వీరు తరచుగా ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టడం హాట్ టాపిక్ అయ్యింది.
అలాగే రెండు పర్యాయాలు మాల్దీవ్స్ వెళ్లారు. ఒకే గదిలో స్టే చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా దొరికాయి. రష్మిక లైవ్ లో మాట్లాడుతుండగా బ్యాక్ గ్రౌండ్ లో విజయ్ దేవరకొండ వాయిస్ వినిపించింది. దాంతో విజయ్ దేవరకొండ-రష్మిక ఒకే గదిలో ఉన్నారన్న కథనాలు వెలువడ్డాయి.
ఇక ఏ చిన్న వేడుక జరిగినా రష్మిక మందాన విజయ్ దేవరకొండ ఇంట్లో వాలిపోతుంది. ఈ ఏడాది దీపావళి వేడుకలు కూడా ఆమె విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో జరుపుకున్నారని సమాచారం. విజయ్ దేవరకొండతో రష్మిక మందానకున్న అనుబంధం, పరిచయం ఇప్పటివి కావని సమాచారం.
యానిమల్ మూవీ ప్రొమోషన్స్ లో రన్బీర్ కపూర్... ఫ్లోలో ఓ మేటర్ లీక్ చేశాడు. అర్జున్ రెడ్డి సక్సెస్ పార్టీలో విజయ్ దేవరకొండ ఇంటి పైన సందీప్ రెడ్డి వంగ రష్మికను మొదటిసారి కలిశారని అన్నారు. గీత గోవిందం విడుదలకు ముందే విజయ్ దేవరకొండతో ఆమెకు బాండింగ్ ఏర్పడినట్లు తెలుస్తుంది.
తాజాగా తమ లవ్ ఎఫైర్ పై హింట్ ఇచ్చారు. రష్మిక మందాన, విజయ్ దేవరకొండ మిర్రర్ స్టైల్ ఫాలో అయ్యారు. ఒకే రకం దుస్తుల్లో కనిపించారు. విజయ్ దేవరకొండ రౌడీ పేరుతో ఒక గార్మెంట్ బ్రాండ్ నడుపుతున్నారు. సదరు బ్రాండ్ ఒకే డిజైన్ కలిగిన హుడీ టీ షర్ట్స్ ధరించారు. ఇది హాట్ టాపిక్ గా మారింది.
ఇక తమ లవ్ ఎఫైర్ ని విజయ్ దేవరకొండ, రష్మిక పలుమార్లు ఖండించారు. ప్రేమ లేదంటూనే వారి చర్యలు అనుమానాలకు దారి తీస్తున్నాయి. ఏదో ఒక రోజు సడన్ గా పెళ్లి ప్రకటన చేయొచ్చనే వాదన వినిపిస్తుంది. ఇక చూడాలి ఏమి కానుందో.
రష్మిక మందాన చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ఆమె నటించిన పాన్ ఇండియా మూవీ యానిమల్ డిసెంబర్ 1న విడుదల కానుంది. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ టైటిల్ తో ఓ చిత్రం చేస్తున్నారు. ఇది వచ్చే ఏడాది విడుదల కానుంది.