స్టన్నింగ్ సిట్టింగ్ ఫోజులతో అట్రాక్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్’ బ్యూటీ.. ట్రెండీ వేర్ లో మెరిసిన అలేఖ్య హారిక..

First Published | Jul 2, 2023, 7:09 PM IST

బిగ్ బాస్ ఫేమ్ హారిక (Bigg Boss Harika) స్టన్నింగ్ లుక్ లో మెరిసింది. ట్రెండీ వేర్ లో యంగ్ బ్యూటీ అట్రాక్ట్ చేసింది. లేటెస్ట్ ఫోటోస్ లో అలేఖ్య హారిక ఇచ్చిన స్టిల్స్ ఫాన్స్ ను ఫిదా చేసేలా ఉన్నాయి. 
 

యూట్యూబ్ సెన్సేషన్ అలేఖ్య హారిక యూత్ లో మంచి ఫాలోయింగ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. 'దేత్తడి' చానల్ తో షార్ట్ ఫిలిమ్స్, కామెడీ కంటెంట్ తో అలరించింది. తెలంగాణ యాస, భాషలో అనర్గళంగా మాట్లాడి ఆకట్టుకుంది. దాంతో తక్కువ కాలంలోనే తనకంటూ ఓ క్రేజ్ సొంతం చేసుకుంది.
 

ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో లోకి అడుగుపెట్టింది. కింగ్, అక్కినేని నాగార్జున హోస్ట్ గా ఉన్న ఈ పాపులర్ రియాల్టీ షో ద్వారా నాలుగో సీజన్ లో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దాంతో బుల్లితెర ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయింది. హౌస్ లోని ప్రతి టాస్క్ లో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ అలరించింది.
 


ఇక హౌస్ నుంచి బయటికి వచ్చాక హారిక క్రేజ్ మరింతగా పెరిగింది. అయితే, యూట్యూబ్ ద్వారా ఫేమ్ అయిన సమయంలోనే హారిక కు సినిమా ఆఫర్లు వచ్చాయి. కానీ అప్పట్లో వద్దనుకున్నట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇక హౌస్ నుంచి బయటికి వచ్చాక సినిమాల్లో మెరుస్తుందని ఫ్యాన్స్ భావించారు.
 

దాని ప్రకారం.. బిగ్ బాస్ ద్వారా వచ్చిన క్రేజ్ ను వినియోగించుకోవడంలో హారిక వెనుకబడిందని చెప్పాలి. ఇప్పటివరకు ఎలాంటి సినిమా లో కనిపించలేదు. కానీ, పలు ప్రారంభోత్సవాలకు హాజరవుతూ సందడి చేస్తోంది. అలాగే కొన్ని సినిమాలను ప్రమోట్ కూడా చేసింది. ప్రస్తుతానికి ఇలా అభిమానులను ఆకట్టుకుంటుంది.
 

ఇక సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్గానే కనిపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫోటోషూట్లతో అదరగొడుతోంది. తాజాగా మరిన్ని ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ట్రెండీ అవుట్ ఫిట్ లో ఖతర్నాక్ ఫోజులతో ఆకట్టుకుంది.

లేటెస్ట్ ఫొటోస్ లో హారిక రెడ్ డ్రెస్.. టైట్ డెనీమ్ జీన్స్ ధరించింది. లూస్ హెయిర్ లో అట్రాక్టివ్ గా మెరిసింది. ఫ్లోర్ పై స్టన్నింగ్ సిట్టింగ్ ఫోజులతో కట్టిపడేసింది. మత్తు చూపులతో కుర్రాళ్లను చూపుతిప్పుకోకుండా చేసింది. ఇక రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ ’వెళ్లకే’ అనే మ్యూజిక్ వీడియోలో నటించి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. 
 

Latest Videos

click me!