అఖిల్ తో తనకున్న రిలేషన్ గురించి ఓపెన్ గా చెప్పేసిన మోనాల్...!

First Published Feb 22, 2021, 2:22 PM IST


అఖిల్-మోనాల్ బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న ఇద్దరు కంటెస్టెంట్స్. హౌస్ లో జంటగా మెలిగిన ప్రేమ పక్షులు. బిగ్ బాస్ షో నడిచినన్నాళ్లు వీరిద్దరి రొమాన్స్ టాక్ ఆఫ్ ది షోగా ఉంది. బిగ్ బాస్ షో ముగిసి దాదాపు రెండు నెలలు అవుతుంది. ఇప్పటికీ వీరి మధ్య రిలేషన్ కొనసాగుతుంది. 
 

అందరూ అఖిల్, మోనాల్ లవర్స్, వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారట అని అంటున్నా... వీరు మాత్రం తమ బంధం ఏమిటో స్పష్టత ఇవ్వలేదు. వీరు జస్ట్ ఫ్రెండ్సా లేకా లవర్స్ నా అనే అయోమయం అందరిలో నెలకొని ఉంది.
undefined
తాజా ఇంటర్వ్యూలో ఈ విషయంపై అఖిల్-మోనాల్ తమ రిలేషన్ గురించి ఓపెన్ గా బయటపెట్టేశారు. యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విధంగా స్పందించారు.
undefined
మొదటగా అఖిల్.. ప్రేమకు స్నేహానికి మధ్య చిన్న లైన్ ఉంటుందని అక్కడే మేము ఉన్నామని అస్పష్టమైన సమాధానం చెప్పాడు. నేను మోనాల్ ని ప్రేమిస్తున్నా.. అలాగని మేము లవర్స్ కాదు అన్నాడు.
undefined
అదే సమాధానం మోనాల్ చెప్పి షాక్ ఇచ్చింది.  అఖిల్ అంటే నాకు చాలా ఇష్టం, అలాగని అతడు జస్ట్ ఫ్రెండ్ అని చెప్పలేను అంతకు మించి అని చెప్పారు ఆమె.
undefined
ప్రేమకు స్నేహానికి మధ్య ఊగిసలాడుతూ ఎటూ తేల్చుకోలేని స్థితిలో మోనాల్-అఖిల్ ఉన్నట్లు వారి సమాధానం బట్టి తెలుస్తుంది.
undefined
ఇక హౌస్ నుండి బయటికి వచ్చాక తమ బంధం ఇంకా బలపడిందని వారు చెప్పడం విశేషం. హైదరాబాద్ లోనే సెటిల్ అయిన మోనాల్ సందర్భం ఏదైనా అఖిల్ తో జరుపుకుంటున్నారు.
undefined
అఖిల్ లో నచ్చిన విషయం తన తెలుగు బాగా అర్థం చేసుకుంటాడని, నచ్చని విషయం కోపం అని మోనాల్ చెప్పారు .
undefined
ఇక మోనాల్ లో వచ్చిరాని తెలుగు భలే నచ్చుతుందని, చిన్న విషయాలకు కూడా ఏడవడం నచ్చని విషయం అని అఖిల్ చెప్పుకొచ్చాడు.
undefined
మొత్తానికి ఒకరికి ఒకరు మద్దతుగా జంటగా మెలుగుతున్నారు అఖిల్ మోనాల్.  ప్రస్తుతం అఖిల్, మోనాల్ కలిసి తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు.
undefined
click me!